Pragati: టాలీవుడ్‌లో విభిన్న పాత్రలు పోషించి, నిజజీవితంలో వెయిట్ లిఫ్టింగ్‌లో అనేక పథకాలను అందుకున్న నటి ‘ప్రగతి’. తాజాగా ఆమె ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రధానంగా సమాజంలో జరుగుతున్న దారుణమైన అన్యాయాలు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల తీవ్రమైన ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమాజంలో నేరాలకు పాల్పడే వ్యక్తులు, ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించేవారు “భూమికి భారం” అని పేర్కొనారు. అటువంటి నేరస్థులకు చట్టపరమైన శిక్షలే కాకుండా, ఇంకా కఠినమైన శిక్షలు ఉండాలని, వారిని “పెట్రోల్ పోసి కాల్చిపడేయాలి” అని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజల్లో మార్పు రావాలని, నేరస్థుల్లో భయం ఉండాలని అన్నారు.
READ ALSO: Pragathi: పెళ్లికి ఆ మూడు ఉండాలి.. అవి లేనప్పుడు వేస్ట్..!
అలాగు ఆమె “టైమ్ మెషిన్ ఎక్కి వెనక్కి వెళ్తే నిర్ణయాలు మార్చుకుంటారా?” ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పటి వరకు తన గత జీవితం, చేసిన పనుల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. తన జర్నీని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ప్రతి దశలోనూ తాను అద్భుతంగా పని చేశానని చెప్పారు. ప్రతి ఒక్కరు తమ జీవితానికి తామే హీరో అని, తన లైఫ్‌ని తాను సెలబ్రేట్ చేసుకోవాలని బలంగా నమ్ముతానని అన్నారు. ఇప్పటి వరకు తన ప్రయాణం పట్ల గర్వంగా ఉన్నట్లు చెప్పారు.
READ ALSO: Pragathi: కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసేవాళ్లు అమ్మాయిల కోసం చూడరు..!