Delhi Acid Attack 2025: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఒక విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. గాయపడిన విద్యార్థిని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కళాశాలకు వెళుతుండగా కాలేజీకి కొద్ది దూరంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.
READ ALSO: Post Office SCSS: పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. వడ్డీతోనే లక్షలు సంపాదించవచ్చు!
బాధితురాలు, ఆమెపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు ఒకరికొకరు తెలిసిన వారని, వారిద్దరూ కూడా ముకుంద్‌పూర్‌లో నివసిస్తున్నారని సమాచారం. ఈ సందర్భంగా భరత్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ.. “ఢిల్లీలోని ముకుంద్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల బాలిక యాసిడ్ దాడిలో గాయపడి దీప్ చంద్ బంధు ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని ఆసుపత్రి నుంచి మాకు ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లి బాధితురాలి వివరాలు తెలుసుకోగా.. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రెండవ సంవత్సరం (నాన్-కాలేజీ) విద్యార్థిని అని, అదనపు తరగతి కోసం అశోక్ విహార్‌లోని లక్ష్మీబాయి కళాశాలకు వెళ్లినట్లు చెప్పింది” అని తెలిపారు. ఆమె కాలేజీకి నడుచుకుంటూ వెళుతుండగా, ముకుందపూర్ నుంచి పరిచయం ఉన్న జితేంద్ర తన స్నేహితులు ఇషాన్, అర్మాన్‌లతో కలిసి బైక్‌పై వచ్చాడు. ఇషాన్ అర్మాన్‌కు ఒక బాటిల్ ఇచ్చాడని, ఆ తర్వాత అర్మాన్ ఆమెపై యాసిడ్ పోశాడని చెప్పింది. బాధితురాలు తన ముఖాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించింది కానీ, ఈ దాడిలో ఆమె రెండు చేతులకు గాయాలయ్యాయి. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.”
పోలీసులు కథనం ప్రకారం.. తనను జితేంద్ర వేధిస్తున్నాడని, దాదాపు నెల రోజుల క్రితం తమ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని బాధితురాలు చెప్పినట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకోడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు అధికారులు వెల్లడించారు.
READ ALSO: SIR 2025: రేపు దేశవ్యాప్తంగా SIR అమలుపై ఈసీ ప్రెస్‌మీట్