ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే..
ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే అంటున్నారు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. ఈ ప్రభుత్వ హయాంలో మంత్రాలయంలో అభివృద్ధికి నోచుకోలేదు.. తాను విజయం సాధించి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తాఅంటున్నారు.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన పాలకుర్తి తిక్కారెడ్డి.. గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీలేదన్నారు.. రోడ్లు నాశనం అయ్యాయి.. రైతులకు, పంటలకు సాగు, తాగు నీరు లేకుండా చేశారని విమర్శించారు. ఇక, గత మూడు సార్లు ఎన్నికల్లో బాలనాగిరెడ్డి దౌర్జన్యంతో గెలిచాడు.. ఈ సారి టికెట్ నాదే.. గెలుపు నాదే.. ఇక బాలనాగిరెడ్డి దౌర్జన్యాలు సాగవు అని హెచ్చరించారు. మా పార్టీ (టీడీపీ)లో కోవర్డులను పెట్టడం బాలనాగిరెడ్డికి ఎప్పుడూ అలవాటే అని ఫైర్ అయ్యారు తిక్కారెడ్డి.. కానీ, ఈ సారి కోవర్ట్ రాజకీయాలు పనిచేయవు అని స్పష్టం చేశారు.. మా పార్టీ అధినేత చంద్రబాబు నాకు సీటు కన్‌ఫామ్ చేశారు.. టీడీపీ మా జెండా.. మంత్రాలయం అభివృద్ధే నా అజెండా అని పేర్కొన్నారు. ఆస్పత్రి, రైల్వేగేట్, తాగునీరు, ఉల్లి రైతుల సమస్యలను తీరుస్తాం అని హామీ ఇస్తున్నారు. ఇసుక, మద్యం దందాలను అడ్డుకోవాలంటే బాలనాగిరెడ్డిని ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. మంత్రాలయం ఓటర్లు ఈ సారి నాకే అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.
35వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె.. సంక్రాంతి పూట వినూత్న నిరసన
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది.. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని ప్రకటించారు అంగన్వాడీలు.. ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. ప్రభుత్వంతో పలు దఫాలుగా సాగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి.. దీంతో.. రోజుకో తరహాలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.. ఇక, సంక్రాంతి పండుగ రోజు కూడా వినూత్న తరహాలో ఆందోళనకు దిగారు.. విజయవాడ ధర్నాచౌక్ లో అంగన్వాడీల నిరసన ధర్నా 35వ రోజుకు చేరుకుంది.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వినూత్న విధానంలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపైనే పొంగళ్లు వండి వారుస్తున్నారు.. అలాగే సంక్రాంతి ముగ్గులు సైతం శిబిరం బయట రోడ్డుమీదే వేసి సంక్రాంతి పాటల బదులుగా నిరసనలు తెలుపుతున్నారు.. రోడ్డుపైనే సంక్రాంతి ముగ్గులు వేసిన నిరసనకు దిగిన అంగన్వాడీలు.. వేతనాలు పెంచేవరకూ పోరాడుతాం అంటూ నినాదాలు చేశారు.. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాడతాం అంటూ నినదించారు.. రోడ్డుపైనే పొంగలి వండి నిరసన వ్యక్తం చేశారు.
ఏమిటా ప్రభల తీర్థం..? ప్రత్యేకత ఏంటి..?
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో గొప్పవి. దేశ, విదేశాలకు కూడా విస్తరించాయి.. ముఖ్యంగా పండుగలు, పర్వదినాలలో తెలుగువారి ఆచారవ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. మన పండుగల్లో సంక్రాంతి పండుగకు విశేషప్రాధాన్యత ఉంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింభించే ఈ పండుగను కోనసీమలోఎంతో ఘనంగానిర్వహిస్తారు. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రభలఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపుఉంది. కోనసీమవ్యాప్తంగా మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభలతీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు. దాదాపు నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ జగ్గన్నతోటలో, జరిగే ప్రభలతీర్థానికి దేశ స్థాయిలో ప్రత్యేకగుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలు ఎగువ కౌశిక దాటివస్తున్న తీరుచూసి భక్తులుగగుర్పాటుకు గురవుతారు. మకరసంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరిపొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం. కోనసీమ అంటేనే అందం. అదివేదసీమా అనిపెద్దల ఉవాచ. శ్రీశైలపర్వత సానువుల తర్వాత తొందరగా మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవక్షేత్రాలు. కోనసీమ నడుమ తరతరాల నుండి జరుగుతున్న “జగ్గన్నతోట” ప్రభలతీర్థం వైభవానికి ఎంతో ప్రఖ్యాత ఉంది . మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతిపురాతనమైన, పవిత్రమైన సమాగమం. ప్రాచీనకాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏవిధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు.. ఇది పూర్తిగా కొబ్బరితోట. ఈ ఏకాదశరుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏకాదశరుద్రుల కొలువు. హిందూధర్మశాస్త్రాల ప్రకారం.. ఏకాదశరుద్రులు ఒక్కచోటకొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా, ఈ భూమండలం మొత్తానికీ ఒక్కచోటే అదీవేదసీమ అయినటువంటి కోనసీమలోనే.. లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాలశివుళ్లు జగ్గన్నతోటలో సమావేశం అయ్యి లోక విషయాలుచర్చిస్తారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ సంప్రదాయం ఉందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వశతాబ్ధంలో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి.. లోక రక్షణగావించారని ప్రతీతి. అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థానదీశులైన శ్రీరాజావత్సవాయి జగన్నాధమహారాజుకు చెందిన ఈతోటజగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది .
ఎన్నికల్లో పోటీ.. మార్పులు, చేర్పులపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఎన్నికలకు అంతా సిద్ధం అవుతున్నారు.. నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను అని కొందరైతే.. అధిష్టానం ఏది చెబితే అదే చేస్తాను అని మరికొందరు నేతలు ప్రకటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్ కు చెప్పాను అన్నారు. పోటీ చేసేవాడ్ని అయితే 2019లోనే పోటీ చేసుండేవాడ్ని.. కంటిన్యూ అయ్యేవాడ్ని.. ప్రత్యక్ష రాజకీయాలు గ్యాప్ రావటంతో పార్టీ పనులు చూస్తున్నా.. పక్కన ఉన్నా కాబట్టి పార్లమెంటుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్ కు చెప్పాను అన్నారు. అయితే, పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయానికి శిరసావహిస్తానని స్పష్టం చేశారు. సీనియర్ నేతలు పార్టీని వీడటానికి వారి వ్యక్తిగత కారణాలు వారికున్నాయన్నారు వైవీ.. సీట్ల మార్పు విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారన్న ఆయన.. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్థులకు సీట్లు ఉండవని ముందు నుంచి సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారని గుర్తు చేశారు. సీట్లు ఇవ్వని వారు కొత్తవాళ్లతో అడ్జస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది.. కానీ, అన్నీ సర్దుబాటు అవుతాయన్నారు. అల్టిమేట్ గా ట్రాక్ రికార్డును బట్టే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఫైనల్ అవుతాయన్నారు. కొత్త మార్పులు, చేర్పులకు సంభందించి పండుగ తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది.. సీటు రానివారికి అసంతృప్తులు ఉంటాయి.. వారికి నచ్చచెప్పి బుజ్జగింపులు చేస్తున్నాం అన్నారు.
మంత్రి దామోదర మెసేజ్ చేస్తే.. రిప్లై ఇవ్వకండి..!
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం, నోటిఫికేషన్‌లను ఎప్పటికప్పుడు చూసి వాటిని రిప్లై ఇవ్వడం.. చాలా మందికి అలవాటుగా మారింది. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వ్యక్తిగత ఖాతాలను కొందరు కేటుగాళ్లు హ్యాక్ అవుతున్నాయి. సైబర్ నేరగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా పేజీలను హ్యాక్ చేసి డబ్బులు దండుకుంటున్న హ్యాకర్లు.. పోలీసు శాఖ ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేసిన విషయం మరిచిపోకముందే.. ఇప్పుడు తాజాగా ఓ మంత్రి ఫేస్ బుక్ పేజీనే హ్యాక్ చేయడం సంచలనంగా మారింది. ఆయన ఎవరో కాదు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఈయన ఫేస్‌బుక్ పేజీను కొందరు హ్యాక్ చేశారు. దామోదర రాజనరసింహ ఫేస్ బుక్ లో రాజకీయాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసిన నాయకులు, ప్రజలు ఒక్కసారిగా బీజేపీ, టీడీపీ, తమిళనాడుకులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు రావడంతో షాక్ తిన్నారు. దామోదర ఫేస్ బుక్ లో వీటికి సంబంధించన పోస్ట్ లు రావడం ఏంటని గుస గుస లాడుకున్నారు.
అయోధ్యకు వెళ్లకపోవడానికి అసలు కారణం చెప్పిన పూరీ పీఠం శంకరాచార్యులు
అయోధ్యలో రాంలాలా పట్టాభిషేక కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకాకపోవడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శంకరాచార్యుల అభిప్రాయాలను తెలియజేస్తూ.. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ కార్యక్రమానికి తాను రానని పూరీ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద మరోసారి పునరుద్ఘాటించారు. ప్రాణ ప్రతిష్టకు వెళ్లకూడదన్న నిర్ణయం మన అహానికి సంబంధించినది కాదు.. అది సంప్రదాయానికి సంబంధించిన విషయమని అన్నారు. సనాతన సంప్రదాయానికి విరుద్ధం కాబట్టే ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని తెలిపారు. ఇక, పూరీ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద మాట్లాడుతూ.. శంకరాచార్యులకు వారి స్వంత గౌరవం ఉంటుంది.. ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు.. ప్రధానమంత్రి ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు మనం బయట కూర్చుని చప్పట్లు కొట్టాలని భావిస్తున్నారా?.. సంప్రదాయాలను తారుమారు చేయడం లౌకిక ప్రభుత్వం చేసే పని కాదు అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 22న రామ్‌లల్లాకు శంకుస్థాపన చేయాలని శంకరాచార్య తీసుకున్న నిర్ణయం కూడా తప్పని అన్నారు. ఈ తేదీ సరైనది కాదని చెప్పారు. అలాంటి కార్యక్రమాన్ని శ్రీరామ నవమి రోజున నిర్వహించాలని శంకరాచార్యులు తెలిపారు.
బడ్జెట్‌లో 50 కోట్ల మందికి ఈ శుభవార్త.. ఆరేళ్ల తర్వాత పెరగనున్న కనీస వేతనం
రానున్న బడ్జెట్‌లో దేశంలోని దాదాపు 50 కోట్ల మంది కార్మికులకు శుభవార్త అందుతుంది. ఆరేళ్ల విరామం తర్వాత ఈసారి కనీస వేతనం పెంచవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే కోట్లాది ప్రజల జీవితాలపై ప్రత్యక్షంగా సానుకూల ప్రభావం చూపుతుంది. దేశంలో కనీస వేతనంలో చివరి మార్పు 2017లో జరిగింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా కనీస వేతనం పెంచలేదు. కనీస వేతనాన్ని మెరుగుపరచడానికి 2021లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్పీ ముఖర్జీ నేతృత్వంలోని నిపుణుల కమిటీ త్వరలో తన సూచనలను సమర్పించవచ్చని, ఆ తర్వాత కనీస వేతనం పెంచవచ్చని ప్రముఖ మీడియా పేర్కొంది. ముఖర్జీ కమిటీ తన పనిని పూర్తి చేసిందని అధికారులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. ఈ కమిటీ తన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఇప్పుడు కావాల్సింది ఒక చివరి రౌండ్ కమిటీ సమావేశం మాత్రమే. ప్రభుత్వం కనీస వేతనం కొత్త పరిమితిని తెలియజేయవచ్చు. త్వరలో కమిటీ పదవీకాలం కూడా ముగియనుంది. జూన్ 2024 వరకు కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వారాల తర్వాత పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ రెండోసారి మోడీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్. ఫిబ్రవరిలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత దేశంలో ఎన్నికలను ఎప్పుడైనా ప్రకటించవచ్చు. లోక్‌సభ పదవీకాలం మేతో ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఏప్రిల్-మే మధ్య లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు.
కూతురు కోసం చెరకు గడలను నెత్తిపై పెట్టుకుని 14 కి.మీ సైకిల్ తొక్కిన పెద్దాయన..
తల్లి దండ్రుల ప్రేమ వెలకట్టలేనిది.. ఎంత రుణం తీర్చుకోవాలని అనుకున్న సరిపోదు.. పిల్లల పై వారి ప్రేమ అనంతం.. పిల్లల ఇష్టం తమ ఇష్టంగా భావించి ఎంతకష్టమైన వాటిని తీర్చేందుకు చూస్తారు.. తమ పిల్లల సంతోషమే తమ సంతోషంగా చాలామంది భావిస్తారు. తాజాగా ఓ వృద్ధుడు తన కూతురికి చెరుకు గడలంటే ఇష్టమని 14 కిలోమీటర్లు చెరుకు గడలను తల మీద పెట్టుకొని సైకిల్ తొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన తమిళ్ నాడులో వెలుగు చూసింది.. తన తలపైన కొన్ని చెరకు గడలను పెట్టుకొని సైకిల్ పై పయనమయ్యాడు.. సరుకులు కూడా సైకిల్ పై పెట్టుకున్నాడు..అవి వొత్తుకోకుండా తలపై ఒక టవల్ పెట్టుకున్నాడు. ప్రజలు అతన్ని ఆశ్చర్యంతో చూశారు, మార్గం మధ్యలో అతనిని ఉత్సాహపరిచారు.. ఆ దృశ్యానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
అబ్బురపరిచే విజువల్స్ తో హృతిక్ ‘ఫైటర్’ ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న యాక్షన్స్..
బాలీవుడ్ స్టార్ హీరో హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఫైటర్”.సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల 25 రిపబ్లిక్ డే కు విడుదల చేయబోతున్నారు.. లక్ష్య చిత్రంలో హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ గా మరచిపోలేని నటన కనబరిచారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్ గా ఫైటర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫైటర్ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టైలర్ లో హృతిక్ రోషన్ పాత్రని షంషేర్ పఠానియ అలియాస్ పాట్టిగా అభిమానులకు పరిచయం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ డ్రాగన్స్ అనే స్పెషల్ టీమ్ కి లీడర్ గా హృతిక్ రోషన్ కనిపిస్తున్నాడు.
సినీ ప్రియులకు పండగే పండగ.. ఈ వారం ఏకంగా 45 సినిమాలు రిలీజ్..
వారం వారం కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఈ వారం సంక్రాంతి సంబరాల హడావిడి మాములుగా లేదని చెప్పాలి.. తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.. ఇక సంక్రాంతికి సినిమాల సందడి కూడా కాస్త ఎక్కువగానే ఉంది.. ఇప్పటికే విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. మరోవైపు ఓటీటీల్లోనూ లెక్కకు మించి సినిమాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి. సంక్రాంతి కలిసి రావడంతో ఈ వారం బోలెడన్ని సెలవులు ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు పెద్ద ప్లాన్ వేశాయి. ఇందులో భాగంగా ఈ వారం రోజుల్లో ఏకంగా 45 సినిమాల్ని స్ట్రీమింగ్ చేయబోతున్నాయి.. ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
హాట్‌స్టార్..
జో (తమిళ మూవీ) – జనవరి 15
ల్యూక్ గుయాన్స్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 15
డెత్ అండ్ అదర్ డీటైల్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 16
ఏ షాప్ ఫర్ కిల్లర్స్ (కొరియన్ సిరీస్) – జనవరి 17
ఇట్ వజ్ ఆల్వేస్ మీ (స్పానిష్ సిరీస్) – జనవరి 17
బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
క్రిస్టోబల్ బలన్సియా (స్పానిష్ సిరీస్) – జనవరి 19
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ (తెలుగు సినిమా) – జనవరి 19
స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20
అమెజాన్ ప్రైమ్..
నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్) – జనవరి 18
ఫిలిప్స్ (మలయాళ సినిమా) – జనవరి 19
హజ్బిన్ హోటల్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ సిరీస్) – జనవరి 19
లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
జొర్రో (స్పానిష్ సిరీస్) – జనవరి 19
నెట్‌ఫ్లిక్స్..
మబోర్షి (జపనీస్ సినిమా) – జనవరి 15
రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) – జనవరి 15
డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 16
అమెరికన్ నైట్‌మేర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 17
ఎండ్ ఆఫ్ ద లైన్ (పోర్చుగీస్ సిరీస్) – జనవరి 17
ఫ్రమ్ ద యాసెస్ (అరబిక్ చిత్రం) – జనవరి 18
కుబ్రా (టర్కిష్ సిరీస్) – జనవరి 18
మేరీ మెన్ 3 (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 18
ప్రిమ్బాన్ (ఇండోనేసియన్ మూవీ) – జనవరి 18
రచిద్ బదౌరి (ఫ్రెంచ్ చిత్రం) – జనవరి 18
ఫుల్ సర్కిల్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 19
లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
మి సోల్ డాడ్ టియన్ అలాస్ (స్పానిష్ సినిమా) – జనవరి 19
సిక్స్ టీ మినిట్స్ (జర్మన్ మూవీ) – జనవరి 19
ద బెక్‌తెడ్ (కొరియన్ సిరీస్) – జనవరి 19
ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 19
ద కిచెన్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 19
కేప్టివేటింగ్ ద కింగ్ (కొరియన్ సిరీస్) – జనవరి 20
జియో సినిమా..
బెల్‌గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 15
ట్రూ డిటెక్టివ్ సీజన్ 4: నైట్ కంట్రీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 15
బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 18
చికాగో ఫైర్: సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 18
లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25
(ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
బుక్ మై షో..
అసైడ్ (ఫ్రెంచ్ సినిమా) – జనవరి 15
ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు (తమిళ మూవీ) – జనవరి 19
ఆల్ ఫన్ అండ్ గేమ్స్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 20
సోనీ లివ్..
వేర్ ద క్రా డాడ్స్ సింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – జనవరి 16
యూట్యూబ్..
ద మార్వెల్స్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 17
ముబీ..
ఫాలెన్ లీవ్స్ (ఫిన్నిష్ సినిమా) – జనవరి 19