ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. సన్ రైజర్స్కు ఉప్పల్ హోంగ్రౌండ్. అయితే.. అక్కడ ఆ పరిస్థితులు కనపడటం లేదు. ఉప్పల్ స్టేడియం చుట్టూ పసుపుమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పసుపు జెర్సీలే కనపడుతున్నాయి. దానికి కారణమేంటంటే.. సీఎస్కే జట్టులో ధోనీ ఉండటం. ధోనీ అంటే.. క్రికెట్ అభిమానులకు ఎంతో అభిమానం.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన ఉత్కంఠపోరులో పంజాబ్ విజయం సాధించింది. చివరి బంతికి శశాంక్ సింగ్ గెలిపించాడు. ఈ మ్యాచ్ లో సూపర్ హీరో శశాంక్ సింగ్ (62*) పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ చివరి బంతికి విజయం సాధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బ్యాటింగ్ లో కెప్టెన్ శుభ్మాన్ గిల్ రాణించాడు. కేవలం 48 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 6 ఫోర్లు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాసేపట్లో మ్యా్చ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే.. పంజాబ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. గాయపడిన లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో సికందర్ రజాకు అవకాశం దక్కింది. గుజరాత్ జట్టు కూడా ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. డేవిడ్ మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్…
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు యువ పేసర్ హర్షిత్ రాణా గాయపడ్డాడు. బంతిని ఆపేందుకు ప్రయత్నించగా అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో.. ఆ మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. తర్వాత ఫీల్డింగ్ రాలేదు. అంతేకాకుండా.. ఆ మ్యాచ్ లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.
విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో రికార్డులకు తెలుగు రాష్ట్రాలు వేదికయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు హైదరాబాద్లో ఇటీవల నమోదు కాగా.. నేడు 2వ అత్యధిక స్కోరు వైజాగ్‌లో నమోదైంది.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 16వ మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు సిక్సర్ల, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.