ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా వైజాగ్ వేదికగాఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 153 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో చివరలో లామ్రోర్ 13 బంతుల్లో 33 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (22), డుప్లెసిస్ (19) పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషియాన్ ఫుడ్ ఫర్ జోన్ ప్లేయర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ క్రికెటర్, ఢిల్లీ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ హాజరయ్యారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ లో క్వింటాన్ డికాక్ (81) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ (40*) పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్స్ దూకుడుగా ఆడటంతో బెంగళూరు ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్ లోటాస్ గెలిచిన బెంగళూరు.. మొదటగా బౌలింగ్ తీసుకుంది. ఈ క్రమంలో లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ జట్టులో అల్జరీ జోసెఫ్ స్థానంలో టాప్లీ ఆడుతున్నారు
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 125 పరుగుల లక్ష్యాన్ని మరో 27 బంతులు ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా మూడు మ్యాచ్ లు ఆడి.. మూడింటిలో గెలిచింది. ఇక.. ముంబై కూడా వరుసగా మూడింటిలో మూడు ఓడిపోయింది. హోంగ్రౌండ్ లో జరిగిన మ్యాచ్…
ఐపీఎల్-2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. హోంగ్రౌండ్ లో పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. రాజస్తాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.