ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్లో గెలుస్తేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ కు అవకాశాలు ఉంటాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీ నేటి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్తో మ్యాచ్లో కూడా ఓడిపోతే ప్లే ఆఫ్స్ అవకాశాల మరింత సంక్లిష్టం అవుతాయి. ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.
Rahul Gandhi: భారతదేశానికి ఒకే నాయకుడు ఉండాలన్నదే బీజేపీ ఆలోచన..
ఆర్సీబీ స్కాడ్ లో బ్యాటింగ్ వైపు నుంచి మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. కేవలం విరాట్ కోహ్లీ తప్పితే మిగతా ప్లేయర్లు ఎవరూ రాణించడం లేదు. మరీ ముఖ్యంగా ఈ సీజన్ లో గ్లేన్ మ్యాక్స్ వెల్ తన ఆటతీరుతో తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ఆడిన అన్నీ మ్యాచ్ ల్లోనూ బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమవుతున్నాడు. ఇక.. యువ ఆటగాళ్లు కూడా అత్యుత్తమ ప్రదర్శన చూపించలేకపోతున్నారు. మొన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో 196 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. ఓడిపోయింది. అందుకు కారణం బౌలింగ్ అని చెప్పవచ్చు. బౌలింగ్ విభాగంలో.. బెంగళూరు జట్టుకు చెప్పుకోదగ్గ బౌలర్లు ఎవరూ లేరు.
ఒక్క మహమ్మద్ సిరాజ్ సీనియర్ బౌలర్ ఉన్నప్పటికీ, ఈ సీజన్ లో అతను ఫామ్ లో లేడు. మిగతా బౌలర్లు వారికి పెద్దగా అనుభవం లేదు. ఆ కారణం చేత బ్యాటింగ్ లో రాణిస్తున్నప్పటికీ, బౌలింగ్ లో వికెట్లు తీయకపోవడం వల్ల ఆర్సీబీ వరుసగా ఓటమి పాలవుతుంది. ఈ క్రమంలో.. ఆర్సీబీకి ఇంకా 8 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. అందులో కనీసం 7 మ్యాచ్ లైనా.. తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే ఆర్సీబీకి ఈసారి కూడా కప్ సాధించడం కష్టం. ఇదిలా ఉంటే.. రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ-సన్ రైజర్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. ఇప్పటికే.. సన్ రైజర్స్ ఆడిన 5 మ్యాచ్ ల్లో మూడింటింలో గెలిచింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ బాగానే రాణిస్తుంది. ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో మరో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది ఎస్ఆర్హెచ్.