దేశంలో కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చుతున్నది. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీలో నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ వీకెండ్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, వీకెండ్ కర్ఫ్యూకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇస్తున్నారు పోలీసులు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్ ధరించడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే, కొంతమంది నెటిజన్ల నుంచి ఢిల్లీ పోలీసులకు వింత వింత ప్రశ్నలు ఎదురౌతున్నాయి.
Read: ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు… మరణాలు…
వారి ప్రశ్నలకు వారి స్టైల్లోనే సమాధానాలు ఇస్తున్నారు. వీకెండ్ కర్ఫ్యూ సమయంలో మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ క్రికెట్ ఆడొచ్చా అనే ప్రశ్నకు పోలీసులు క్రికెట్ స్టైల్లోనే సమాధానం ఇచ్చారు. అది సిల్లి పాయింట్ అని, దానికి ఎక్స్‌ట్రా కవర్ అవసరమని, అంతేకాదు, ఢిల్లీ పోలీసులు బాగా క్యాచింగ్ చేయగలుగుతారని సమాధానం ఇచ్చారు. క్రికెట్ పొరగాళ్లు అడిగిన సిల్లీ క్వశ్చన్‌కు అంతే సిల్లీగా పోలీసులు సమాధానం చెప్పారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది.
That’s a ‘Silly Point’, Sir. It is time to take ‘Extra Cover’. Also, #DelhiPolice is good at ‘Catching’. https://t.co/tTPyrt4F5H
— Delhi Police (@DelhiPolice) January 7, 2022