ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ధర్మవరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నాను అన్నారు.. ఉదయమే నేను ప్రతీ ఇళ్లు తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నాను.. మధ్యాహ్నం నా భార్య తిరుగుతుంది.. సాయంత్రం నా తమ్ముడు తిరుగుతున్నాడు.. ఇలా మా కొంపంతా మీకు చాకిరీ చేస్తున్నామంటూ జనంపై కాస్త అసహనం వ్యక్తం చేశారు.. ఇలా మా ఇంటిల్లిపాది మీకే చాకిరీ చేస్తున్నాం.. అయినా లోకేష్ లాంటి పనికిమాలిన వాడు విమర్శలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.. మొన్న పరోటా, పుల్కాలు ఇద్దరు పాదయాత్ర చేశారంటూ సెటైర్లు వేసిన ఆయన.. నాపై అనవసరమైన విమర్శలు చేశారని మండిపడ్డారు. ధర్మవరం నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లు నేను కట్టిస్తే.. వారు కట్టించామంటారు అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు కేతిరెడ్డి.. ధర్మవరంలో 12 వేల ఇళ్లు కట్టించాను.. తాగునీటి సమస్య లేకుండా చేశాను.. చంద్రబాబు హయాంలో ధర్మవరంలో ఒక్క ఇల్లు అయినా కట్టించాడా..? అని ప్రశ్నించారు. ఎవరైనా చదువుకోమని పిల్లలకు చెబుతారు.. కానీ, పనికిమాలిన లోకేష్ 20 కేసులు ఉంటే కానీ నా వద్దకు రావద్దు అంటాడు.. వీడు ఒక ముఖ్యమంత్రి కొడుకు.. కాబోయే ముఖ్యమంత్రి అట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీరంతా ఒకటే ఆలోచించుకోవాలి.. ప్రజలను నమ్ముకునే సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేస్తున్నారు.. ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత మనపైనే ఉందంటున్నారు. సంక్షేమ పథకాలతో అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది.. మీరు బాగుండాలి, మీ పిల్లలకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాం.. కానీ, లోకేష్ లాంటి వాళ్లు వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. గలాట పెట్టుకొండి, కేసులు ఉండాలని చెబుతున్నాడు అంటూ మండిపడ్డారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అయితే, నా కుటుంబం మొత్తం మీకు చాకిరీ చేస్తుందంటూ.. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.
బర్త్ డే విషెస్‌తో ఒక్కటైన విడిపోయిన సాఫ్ట్‌వేర్ జంట.. సీఐపై ప్రశంసలు..
విడిపోయిన జంటను పుట్టినరోజు ఏకం చేసింది.. పుట్టినరోజు ఏంటి..? జంటను ఏకం చేయడం ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అయితే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన ఓ జంట విడిపోయింది.. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్నపాటి గొడవతో ఆ పంచాయతీ కాస్తా.. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు చేరింది.. ఆ జంటను పోలీస్ స్టేషన్‌కు పిలిచిన చంద్రగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.. సాఫ్ట్‌వేర్ జంటతో పాటు కుటుంబ సభ్యులు పీఎస్‌కు వచ్చారు.. అయితే, యువ దంపతులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో అర్థ రాత్రి 12 గంటలు దాటిపోయింది సమయం.. 12 గంటల దాటడంతో ఆ సాఫ్ట్‌వేర్ జంటలోని భర్త పుట్టిన రోజు కూడా వచ్చేసింది.. దీంతో, భర్తకు భార్య చేత పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పించారు చంద్రగిరి పోలీసులు. సాఫ్ట్‌వేర్ జంటను ఒకటి చేసి బంధువులలో సంతోషాన్ని నింపారు చంద్రగిరి సీఐ ఓబులేసు.. భర్తకు భార్య బర్త్‌డే శుభాకాంక్షలు తెలపడంతో.. రెండు కుటుంబాల్లో నవ్వులు విరిసాయి.. భార్యతో పాటు ఆమె కుటుంబసభ్యులు, బంధువులు.. భర్త తరపు బంధువులు అంతా అక్కడ ఆ యువకుడికి శుభాకాంక్షలు తెలిపారు.. గొడవను ఇలా సర్దిచెప్పినా చంద్రగిరి పోలీసులకు ప్రశంసల కురిపిస్తున్నారు నగర వాసులు.
కాంగ్రెస్ తెచ్చిన సంస్కరణలతోనే మోడీ ప్రధాని అయ్యారు
70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయకపోతే మోడీ ప్రధాని అయ్యేవారు కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే నేడు మోడీ ప్రధాని అయ్యారని, అమిత్ షాకు హోంమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు అన్నారు. శుక్రవారం రాత్రి తెలంగాణలోని మంచిర్యాలలో జరిగిన ‘జై భారత్ సత్యాగ్రహ సభలో’ ఖర్గే ప్రసంగించారు. తనలాంటి పేదవాడిని ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ప్రోత్సహించి ఉండకపోతే తాను శాసనసభ్యుడిని అయ్యేవాడిని కాదన్నారు. తనలాంటి నిరాడంబరమైన నేపథ్యం ఉన్న వ్యక్తి సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కొనసాగించేందుకు ఎమ్మెల్యేగా, ఎంపీగా నిలవడం తమ పార్టీ వల్లేనని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారని, కాంగ్రెస్ తీసుకొచ్చిన సంస్కరణలతోనే నేడు మోదీ ప్రధాని అయ్యారని, అమిత్ షా హోంమంత్రి అయ్యే అవకాశం ఉందని ఖర్గే అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో నెహ్రూ అంబేద్కర్‌తో కలసి పనిచేసి రాజ్యాంగ పరిరక్షణకు సహకరించారని గుర్తు చేశారు. బీజేపీ నేతలు దేశానికి ఏం చేశారో చెప్పాలన్నారు. దేశ సేవలో వారి పాత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. అంతేకాదు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
జులై 1 నుంచి అమరనాథ్ యాత్ర ప్రారంభం
హిమాలయాల్లో కొలువైన అమర్‌నాథ్ ఆలయ యాత్ర జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31, 2023న ముగుస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు మోడ్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. అమర్‌నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమవుతుందని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ప్రకటించారు. యాత్రకు వివరాల కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. యాత్రలో యాత్రికులు, సర్వీస్ ప్రొవైడర్లకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని సిన్హా హామీ ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభానికి ముందే టెలికాం సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. పవిత్ర తీర్థయాత్ర, రిజిస్ట్రేషన్ తేదీలను ప్రకటిస్తూ సిన్హా ఇలా అన్నారు. “ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రధాన ప్రాధాన్యత అవాంతరాలు లేని తీర్థయాత్ర. సందర్శించే భక్తులు, సర్వీస్ ప్రొవైడర్లందరికీ అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరమైన సౌకర్యాలను అందిస్తుంది. తీర్థయాత్ర ప్రారంభానికి ముందే టెలికాం సేవలు అందుబాటులోకి వస్తాయి.’ అని ఆయన అన్నారు. యాత్ర సజావుగా సాగేందుకు వసతి, విద్యుత్, నీరు, భద్రత, ఇతర ఏర్పాట్ల కోసం అన్ని వాటాదారుల విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. యాత్ర రెండు మార్గాల నుంచి ఏకకాలంలో ప్రారంభమవుతుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్. పరిశుభ్రత ఉండేలా చూడాలని, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ కోసం అవసరమైన జోక్యాలను తీసుకోవాలని సిన్హా అధికారులను ఆదేశించారు.
లోయలో పడిన బస్సు.. 13 మంది మృతి, 25 మందికి పైగా గాయాలు
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. పూణేలోని పింపుల్ గురవ్ నుంచి గోరెగావ్‌కు బస్సు వెళ్తుండగా పూణె-రాయ్‌గఢ్ సరిహద్దులో తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. “రాయ్‌గఢ్‌లోని ఖోపోలి ప్రాంతంలో బస్సు కాలువలో పడటంతో 13 మంది మరణించారు. 25 మందికి పైగా గాయపడ్డారు. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.” అని రాయ్‌గఢ్ ఎస్పీ సోమనాథ్ ఘర్గే తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో రోడ్డు పక్కన అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు నిలిచిపోయాయి.
ట్విట్టర్ యూజర్లకు మస్క్ బంపరాఫర్.. ఇలా సంపాదించుకోండి..!
ఎలాన్ మస్క్ ఎంట్రీ తర్వాత సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి అనేక మంది ఉన్నతాధికారులను, ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్.. బ్లూటిక్‌కు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు.. అంతేకాదు.. ట్విట్టర్ యూజర్లు అందరికీ ఆయన షాకిచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది.. ఇక, ట్విట్టర్ లోగాలోనూ మార్చులు జరిగాయి.. అయితే, బిజినెస్ ఎలా చేయాలనే దానిపై ఓ స్పష్టమైన అవగాహన ఉన్న మస్క్.. ఇప్పుడు ట్విట్టర్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించారు.. తమ కంటెంట్ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం యూజర్లకు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా డబ్బులు సంపాదించుకునే పనిలోపడిపోయిన ఎలాన్ మస్క్.. యూజర్లకు ఆ అవకాశం ఎలా? ఇస్తారు అనే విషయాల్లోకి వెళ్తే.. ఏదైనా ఎక్కువ సమాచారం నుంచి ఎక్కువ నిడివి ఉన్న వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ తో డబ్బు సంపాదించవచ్చని పేర్కొన్నారు.. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుందని వివరించారు.. అయితే, ఈ ఆప్షన్ ప్రస్తుతానికి అమెరికా లాంటి దేశాల్లో అందుబాటులో ఉండగా.. భారత్‌లో మాత్రం ఇంకా ప్రారంభించలేదు.. మరికొన్ని రోజుల్లో అన్ని దేశాలకు ఈ ఆప్షన్ విస్తరింపజేసే పనిలో పడిపోయింది ట్విట్టర్… ఇక, మొదటి 12 నెలల పాటు, సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వినియోగదారులు సంపాదించే డబ్బులో ట్విట్టర్ ఎలాంటి మొత్తాన్ని తీసుకోదట.. అంటే సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన డబ్బులో గరిష్ఠంగా 70 శాతం వరకు యూజర్లకే ఇస్తారు.. కానీ, ట్విటర్ ద్వారా వచ్చిన డబ్బులో నుంచి ఐఓఎస్, ఆండ్రాయిడ్ 30 శాతం యాప్ స్టోర్ ఫీజు వసూలు చేయనున్నాయి.. అంతే కాకుండా తమ కంటెంట్ ప్రమోట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.. ట్విట్టర్ ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌తో డబ్బు ఆర్జించే ప్రయత్నాలతో పోరాడుతోంది. ఇప్పుడు వినియోగదారులు కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించారు.
జపాన్ ప్రధానిపై దాడి…
జపాన్ ప్రధానిపై దాడి జరిగింది. వాకయామా నగరంలో బహిరంగ ప్రసంగం సందర్భంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమీపంలో పైపు లాంటి వస్తువు విసిరారు. ఘటనా స్థలంలో పేలుడు లాంటి శబ్దం వినిపించింది. అయితే ఘటనా స్థలంలో గాయాలు లేదా నష్టం జరిగినట్లు వివరాలు తెలియరాలేదు. ప్రధాని కిషిడా పేలుడు జరిగిన ప్రదేశంలో నుంచి సురక్షితంగా బయటపడ్డారని జపాన్ మీడియా పేర్కొంది. కిషిదా ఘటనా స్థలంలో తలదాచుకున్నారని, ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. పశ్చిమ జపనీస్ నగరంలో ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించిన తర్వాత కిషిడా తన ప్రసంగాన్ని ప్రారంభించినట్లు జపాన్ మీడియా పేర్కొంది. పశ్చిమ జపాన్‌లోని వాకయామాలో కిషిడా ప్రసంగించడానికి వచ్చిన ప్రదేశంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. కాగా, గతేడాది జూలై 2022లో ప్రచార కార్యక్రమంలో మాట్లాడున్న సందర్భంగా మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు. షింజో అబే హత్య తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ ఢీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో రెండు వరుస పరాజయాల తర్వాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తల పడనుంది. ప్రస్తుత సీజన్‌లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ మ్యాచ్‌లలో దేనినీ గెలవలేదు. ఇప్పటి వరకు ఢిల్లీ టీమ్ పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు. కెప్టెన్ ముందు నుంచి దూకుడుగా ఆడుతున్న.. అయితే అతని స్ట్రైక్ రేట్ ప్రధాన సమస్యగా ఉంది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు టీమ్ కి పెద్ద సమస్యగా మారింది. బౌలర్లు ఇప్పటివరకు మంచిగా ఉన్నారు.. కానీ ఇంకా మెరుగుదల కోసం ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉంటే, అక్షర్ పటేల్ ఫామ్ తదుపరి మ్యాచ్‌లో వారి అవకాశాలను ఖచ్చితంగా పెంచుతుంది. ఇక ఆతిథ్య జట్టు ఆర్సీబీ విషయానికి వస్తే లక్నోతో జరిగిన చివరి మ్యాచ్‌లో బెంగళూరు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మిడిల్ ఓవర్లలో వారి బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. నికోలస్ పూరన్ మరియు మార్కస్ స్టోయినిస్ సరదా కోసం కొట్టడంలో ఎలాంటి సమస్య లేదు. టీమ్ మేనేజ్‌మెంట్ తక్షణమే పరిష్కరించాల్సిన ఒక ప్రాంతం అది. బ్యాటింగ్ పరంగా, విరాట్ కోహ్లీ మరియు ఫాఫ్ డు ప్లెసిస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. గ్లెన్ మాక్స్‌వెల్ కూడా మునుపటి మ్యాచ్‌లో తన క్లాస్‌ని చూపించాడు. వాస్తవానికి సానుకూలతలు ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్ యూనిట్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానంలో సాధారణంగా ఏ లక్ష్యమూ సురక్షితంగా ఉండదు కాబట్టి.. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు ప్రారంభం నుంచే విధ్వంసం సృష్టించాలి. ఈ వికెట్‌లో ముందుగా బౌలింగ్ చేయడం అనువైనది. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో అతను 173.26 స్ట్రైక్ రేట్‌తో 175 పరుగులు చేశాడు. అతను మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు సాధించగలడు మరియు అది RCBకి పెద్ద ప్లస్ పాయింట్.