ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 2021లో జరిగిన T20 ప్రపంచ కప్ లో ఆడాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో చీఫ్ సెలెక్టర్ కుర్చీ ఖాళీగా ఉండటంతో.. ఇతని పేరు బయటికొచ్చింది.