క్రికెట్ అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్. రేపు జరగబోయే ఇండియా-పాకిస్తాన్ కు మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. శుభ్ మాన్ గిల్ 99 శాతం ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. గిల్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నాడని రోహిత్ శర్మ తెలిపాడు.
ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ పలికాడు. కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా తన సేవలు అందించాడు. 2018 సెప్టెంబర్ లోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ పలికినప్పటికీ.. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో ఆడాడు. ఇప్పుడు తన 38 ఏళ్ల వయస్సులో అన్ని రకాల ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
సెప్టెంబర్ 2023కి సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'ని ఐసీసీ ప్రకటించింది. ఈసారి శుభ్‌మాన్ గిల్‌ను ఈ నెల ఉత్తమ ఆటగాడిగా ఎంపిక చేశారు. సహచర ఆటగాడు మహ్మద్ సిరాజ్, ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్‌లను పక్కకు నెట్టి శుభ్‌మాన్ ఈ టైటిల్‌ను సాధించాడు.
2023 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చారిత్రాత్మక వికెట్ తీశాడు. తొలి ఓవర్ తొలి బంతికే బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ క్యాచ్ పట్టాడు. ఈ వికెట్‌తో ట్రెంట్ బౌల్ట్ వరల్డ్ కప్ మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా నిలిచాడు.
Breaking news: ఎన్నాళ్ల నుంచో చర్చలో ఉన్న ఒలింపిక్స్‌లో కిక్రెట్ చేరిక అంశం ఖరారైంది. 2008 లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ గేమ్స్ నుంచి క్రికెట్ ను కూడా చేర్చడానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపింది.
రేపు(శనివారం) అహ్మదాబాద్‌లో భారత్-పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్ 2023లో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్-పాకిస్థాన్ విజయం సాధించాయి. అయితే రేపటి మ్యాచ్లో వాతావరణం గురించి మాట్లాడితే మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం లేదు.
ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 134 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది. 312 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 40.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు.. ఆరంభంలోనే ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు.
2023వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆశించినంత ప్రదర్శన చూపించడం లేదు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం ఫామ్‌పై పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజం మరోసారి ఫ్లాప్ అయ్యాడని అన్నాడు. బాబర్ ఆజం విఫలమైనప్పటికీ.. మంచి ఫాంలో ఉన్న ఆటగాడు మరొకరు దొరికాడని తెలిపాడు.