శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ
తిరుమలలో కొలువుదీరిన కొలిచినవారి కొంగుబంగారం.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రత్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది.. రేపటి నుంచి అంటే అక్టోబర్ 15వ తేదీ 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం మాడవీధులలో ఉరేగనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. రేపు ఉదయం బంగారు తిరుచ్చి పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. రేపు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై ఊరేగనున్నారు శ్రీవారు. ఇక ఇవాళ, రేపు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీచేసే టోకెన్లు రద్దు చేసింది టీటీడీ.. మరోవైపు.. ఇవాళ నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 19వ తేదీన శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.. షెడ్యూల్ సమయం కంటే అరగంట ముందుగానే గరుడ వాహన సేర నిర్వహించేలా అంటే.. సాయంత్రం 6:30 గంటలకే ప్రారంభం కానుంది గరుడ వాహన సేవ.. ఈ నేపథ్యంలో 19వ తేదీన ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాలకు అనుమతి నిలిపివేయనున్నారు టీటీడీ అధికారులు.
నేడు, రేపు ఎస్సై మెయిన్స్ పరీక్షలు.. అభ్యర్థులు ఇవి మర్చిపోవద్దు..
ఈ రోజు, రేపు.. ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష ఉండగా.. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో మరో రెండు పేపర్లు ఉండనున్నాయి.. కాగా, ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో మెయిన్ పరీక్షకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వీరిలో 27,590 మంది పురుష అభ్యర్థులు.. 3,603 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.. ఈ రోజు పేపర్–1 అంటే డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే పరీక్ష నిర్వహించనున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుండగా.. రేపు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పేపర్–3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు.. పేపర్–4 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల నిర్వహించనున్నారు.. ఇక, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్సై పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే..
నేడే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ.. ఆడబిడ్డలకు సీఎం శుభాకాంక్షలు
తెలంగాణ ఆత్మగౌరవానికి, అద్వితీయ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా పూలను పూజించే పండుగ బతుకమ్మ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందన్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభించి చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే వరకు ఆడపిల్లలు, అబ్బాయిలు అందరూ కలిసి ఆటలు, కోలాటాలతో జరుపుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ పండుగ చాటిచెబుతుందని అన్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు మహిళా సాధికారతను పెంపొందించి దేశానికే ఆదర్శంగా నిలిచాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు, సంతోషాలు ప్రసాదించాలని సీఎం కేసీఆర్ ప్రకృతి మాతను ప్రార్థించారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో రెడీ..! ఏ వర్గాలకు ప్రాధాన్యత.. ఏటువంటి హామీలు ఉంటాయి ?
తెలంగాణలో ఎలక్షన్ హీట్ మొదలైంది. బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించింది. మేనిఫెస్టోనూ అందరి కంటే ముందే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ నెల 15న మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ , బీజేపీలు కొన్ని హామీలు ప్రకటించడంతో.. వాటికి ధీటుగా హామీలు ఉండేలా గులాబీ పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నాలుగైదు వర్గాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా రైతు బంధు, రైతు బీమా పథకాల కింద ఇస్తున్న నగదును మరింత పెంచే హామీ మేనిఫెస్టోలో ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక, మహిళల సాధికారత కోసం ఫోకస్ ఉంటుందనీ చెబుతున్నాయి. ఇందులో భాగంగా గృహిణులకు ఊరట ఇచ్చేలా వాగ్దానాలు ఉంటాయని అంటున్నారు. మరోవైపు.. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాల అమలును మరింతగా ముందుకు తీసుకుపోయే విధంగా మేనిఫెస్టోలో అంశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. సామాజిక భద్రత లో భాగంగా ఇస్తున్న వివిధ రకాల పెన్షన్లకు ఇస్తున్న నగదు సాయం మరింత పెంచే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మధ్య తరగతి వర్గాలు కవర్ అయ్యేలా మరో హామీని కూడా పొందు పరిచారని సమాచారం. ఇటు యువతకు దగ్గర అయ్యేందుకు కూడా హామీలు ఉంటాయని తెలుస్తోంది. 2018 మేనిఫెస్టోతో పోల్చితే.. దాదాపు అన్ని వర్గాలు కవర్ అయ్యేలా 2023 మేనిఫెస్టో ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
ఐదు రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు.. కిరణ్ రిజిజుకి కీలక బాధ్యతలు..
ఐదురాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ మొదలైంది. షెడ్యూల్ వచ్చినప్పటినుంచి.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో.. కీలక పనులన్నీ చకచకా చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగానే.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజుని మిజోరాం రాష్ట్రానికి ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పాటు ఇతర నేతలకూ కీలక బాధ్యతలను పార్టీ అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ, నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి యంతుంగో పాటన్‌లు మిజోరాం ఎన్నికలకు పార్టీ కో-ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారని బీజేపీ తెలిపింది. మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. నవంబర్ 7న ఎన్నికలు, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2018 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు గెలిచింది. జెడ్‌పీఎం 8 స్థానాల్ని కైవసం కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ ఐదు, బీజేపీ ఒక సీటు మాత్రమే సొంతం చేసుకున్నాయి. ఈసారి మిజోరాంలోనూ సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజేపీ తనదైన వ్యూహాలు రచిస్తోంది. అటు.. జతీందర్ పాల్ మల్హోత్రాను పార్టీ ఛత్తీగఢ్ యూనిట్ ప్రెసిడెంట్‌గా నియమించింది.
లెబనాన్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో ఒక జర్నలిస్టు మృతి.. ఆరుగురికి గాయాలు
లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరిగిన యుద్ధాన్ని కవర్ చేస్తూ ఒక జర్నలిస్టు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. జర్నలిస్టులందరూ దక్షిణ లెబనాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో యుద్ధాన్ని కవర్ చేస్తున్నారు. అందరినీ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తన ఇద్దరు ఉద్యోగులు ఎలి బ్రాఖ్య, రిపోర్టర్ కార్మెన్ జౌఖ్దర్ గాయపడ్డారని ఖతార్ అల్-జజీరా టీవీ తెలిపింది. గత శుక్రవారం లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో ఇజ్రాయెల్ సైనికులు, లెబనాన్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో రాయిటర్స్ జర్నలిస్ట్ మరణించాడు. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ షెల్లింగ్‌లో దాని వీడియోగ్రాఫర్ ఇస్సామ్ అబ్దుల్లా మరణించినట్లు రాయిటర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు జర్నలిస్టులు తాయెర్ అల్ సుదానీ, మెహర్ నజా గాయపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరిస్తున్నామని రాయిటర్స్ తెలిపింది. అంతేకాకుండా మరణించిన జర్నలిస్టులు, గాయపడిన ఉద్యోగులకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ 5000 రాకెట్లతో దాడి చేసింది. దీని కారణంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. ఇద్దరి మధ్య యుద్ధం కొనసాగుతోంది. హమాస్‌కు కంచుకోటగా ఉన్న గాజాపై ఇజ్రాయెల్ నిరంతరం బాంబు దాడులు చేస్తోంది. హమాస్ అనేక స్థానాలు ధ్వంసమయ్యాయి. అదే సమయంలో గాజాకు విద్యుత్, నీటి సరఫరాను కూడా ఇజ్రాయెల్ అంతరాయం కలిగించింది. ఈ యుద్ధంలో హమాస్ తరపున హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్‌పై నిరంతరం దాడి చేస్తోంది. హమాస్ వలె, హిజ్బుల్లా కూడా ఒక తీవ్రవాద సంస్థ, ఇది గత కొన్ని సంవత్సరాలుగా లెబనాన్‌లో చురుకుగా ఉంది. ఈ సంస్థలకు ఇరాన్ నిరంతరం సహాయం చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ పోరాటంలో ఇజ్రాయెల్‌కు అమెరికా వంటి అనేక శక్తివంతమైన దేశాలు అండగా నిలుస్తున్నాయి.
నేడు బరిలోకి దిగనున్న దాయాదులు.. అందరి దృష్టి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పైనే
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను క్రికెట్‌లో అతిపెద్ద మ్యాచ్ అని పిలుస్తారు. లక్షలాది మంది దీనిని చూస్తున్నారు. విజయాల్లో భారీ సంబరాలు, పరాజయాల్లో ఆటగాళ్లపై విమర్శలు కామన్. అయితే ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా ఒక్కటి మాత్రమే విజేతగా నిలిచింది. 1992లో సిడ్నీలో తొలిసారి తలపడినప్పటి నుంచి ప్రపంచకప్‌లో భారత్ ఏడుసార్లు పాకిస్థాన్‌ను ఓడించింది. శనివారం అహ్మదాబాద్‌లో ఆతిథ్య జట్టుతో ఈ వరుస ఓటములకు తెరపడుతుందని బాబర్ అజామ్ జట్టు భావిస్తోంది. సరే, శనివారం మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా రెండు జట్ల ప్రయాణం ఇంతకు మించి కొనసాగుతుంది. ఇది లీగ్ దశ దాటి కూడా కొనసాగుతుంది. రెండు జట్లూ తమ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగితే, అభిమానులు ఇద్దరి మధ్య మరో మ్యాచ్‌ని చూడగలరు. ఈ మ్యాచ్ సెమీ ఫైనల్స్ లేదా ఫైనల్స్‌లో జరగవచ్చు. టోర్నీలో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్‌లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పటి వరకు ఇద్దరి ఫామ్ అద్భుతంగా ఉంది. రోహిత్ సేన ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లను ఓడించగా, పాకిస్థాన్ నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించింది. రెండు జట్లూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో మళ్లీ తలపడే అవకాశం ఉంది.
1992 నుండి భారత్ వర్సెస్ పాక్ వన్డే వరల్డ్ కప్‌లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే?
2023 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 14 శనివారం భారత్ – పాకిస్థాన్మ్యాచ్జరగనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం సమరానికి రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచంలోకి క్రికెట్ ప్రియుల కళ్లన్నీ ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో పాక్‌పై భారత్‌కు ఘనమైన ట్రాక్రికార్డు ఉంది. ప్రపంచకప్ హిస్టరీలో పాకిస్థాన్‌తో 7 సార్లు తలపడగా.. ఏడింట్లోనూ భారత జట్టు విజయం సాధించింది. అయితే జట్టులోని సభ్యులందరూ సమష్టి కృషితో రాణించినప్పుడే.. ఇలాంటి విజయాల్ని నమోదు చేయగలం. ఇక శనివారం కూడా మ్యాచ్ లో గెలిచి పాక్ పై జైత్రయాత్రను కొనసాగించాలని టీమ్ ఇండియా భావిస్తోంది. మరోవైపు ఈసారైనా భారత్‌పై నెగ్గాలని పాకిస్థాన్ తహతహలాడుతోంది. ఈ క్రమంలో ఆయా వరల్డ్కప్ఎడిషన్లలో పాక్‌పై మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్అవార్డు గెలుచుకున్న టీమ్ ఇండియా ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం. భారత్-పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ 1992 మ్యాచ్‌లో 54 (62) పరుగులు చేసినందుకు సచిన్ టెండూల్కర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 1996లో నవజ్యోత్ సిద్ధూ 93(115) స్కోర్‌తో దానిని కైవసం చేసుకోగా, 1999లో వెంకటేష్ ప్రసాద్ ఐదు వికెట్లు తీసి విజేతగా నిలిచాడు. 2003, 2011లో కూడా సచిన్‌కు ఈ అవార్డు దక్కింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 2015, 2019 ఎడిషన్లలో దీనిని గెలుచుకున్నారు.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనాలనుకుంటున్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొన్ని రోజుల వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు శనివారం మాత్రం ధరల్లో ఎటువంటి మార్పు లేదని చెప్పాలి.. శుక్రవారం నమోదు అయిన ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు స్థిరంగా ఉన్నాయి.. మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 54,000 ధర పలుకుతోంది. అదేవిధంగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.72, 600 పలుకుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ. 72,600 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ ఇదే ధరలు అమలవుతున్నాయి.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది..ఢిల్లీలో రూ. 72,600, ముంబైలో 72,600, బెంగళూరులో రూ. 71,500, కోల్‌కతా రూ. 72,600, చెన్నైలో 77,000లకు కిలో వెండి లభిస్తోంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
మొదటి పది నిముషాలు మిస్ అవ్వకండి… ప్లీజ్
దళపతి విజయ్ తో మాస్టర్ తర్వాత సెకండ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అండర్ వరల్డ్, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు చేసే లోకేష్, ఈసారి కాశ్మీర్ లో అడుగుపెట్టి సినిమా చేసాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి బయటకి వచ్చి సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్, లియో మూవీని స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేస్తున్నాడు. మాస్టర్ కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గానే తెరకెక్కింది కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. ఆ ఇంపాక్ట్ మాత్రం లియో సినిమాపై పడలేదు. లియో అనౌన్స్ అయినప్పుడు ఉన్న అంచనాలు ఇప్పుడు మరింత పెరిగాయి. సాలిడ్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ని రిలీజ్ చేసిన తర్వాత లియో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఉన్న హైప్ కి కాస్త పాజిటివ్ టాక్ తోడైతే చాలు లియో మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో లియో సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యి… సెన్సేషనల్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా లియో సినిమా స్టార్టింగ్ 10 మినిట్స్ మిస్ అవ్వకండి, ఆ 10 మినిట్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది. దాని కోసమే లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ వర్క్ చేస్తూనే ఉన్నాం అని చెప్పాడు. లోకేష్ అదే పనిగా ఫస్ట్ 10 మినిట్స్ మిస్ అవ్వకండి అంటున్నాడు అంటే అది లియో సినిమాలో ఎంత స్పెషల్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఆ స్పెషల్ సీన్స్ లో ఆడియన్స్ కి లోకేష్ ఎలాంటి థ్రిల్ ఇస్తాడో తెలియాలి అంటే అక్టోబర్ 19 వరకూ వెయిట్ చేయాల్సిందే.
టైగర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మిస్ అవుతున్నాడా?
పండగ సీజన్ అనగానే ఫ్యామిలీతో పాటు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడడం తెలుగు ఆడియన్స్ కి ఉన్న అలవాటు. ఈ కారణంగానే మన దగ్గర థియేటర్స్ ఇంకా బ్రతికున్నాయి. కుటుంబమంతా కలిసి సినిమా చూసి, లంచ్ లేదా డిన్నర్ చేస్తే పండగని బాగా సెలబ్రేట్ చేసుకున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు పబ్లిక్. ఇలా కుటుంబ మొత్తం థియేటర్స్ కి కదిలివచ్చేది పండగ రోజుల్లోనే, అందుకే మేకర్స్ ఫెస్టివల్ సీజన్స్ ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ దసరాకి మాత్రం రవితేజ ఫ్యామిలీ ఆడియన్స్ ని మిస్ చేస్తున్నట్లు ఉన్నాడు. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ… భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ సినిమాల్లో భగవంత్ కేసరి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అనీల్ రావిపూడి సినిమాల్లో ఉండే ఫన్ భగవంత్ కేసరి సినిమాలో ఉన్నట్లు ప్రమోషనల్ కంటెంట్ చెప్పేసింది. శ్రీలీల, బాలయ్య క్యారెక్టర్ మధ్య ఎమోషనల్ డ్రామా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ భగవంత్ కేసరి సినిమాకి వెళ్లే అవకాశం ఉంది. లియో విషయంలో లోకేష్ కనగరాజ్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యి యూత్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. త్రిషాతో ట్రాక్ క్లిక్ అయితే లియో ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, లేదంటే యూత్ కే పరిమితం అవుతుంది. ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంది కానీ టైగర్ నాగేశ్వర రావు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాడు. రవితేజ సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్స్ కి వెళ్లిపోతారు. మొదటిసారి టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని రవితేజ మిస్ అవుతున్నట్లు ఉన్నాడు. ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే అంశాలు కనిపించట్లేదు. ఇది రవితేజ సినిమా కలెక్షన్స్ ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.