ప్రపంచ కప్ 2023లో బుధవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు, క్రికెట్ అభిమానులు కూడా హృదయాన్ని హత్తుకునే దృశ్యాన్ని చూశారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం (ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియం)లో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్-ఉల్-హక్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ విజయాల బాటలో పయనిస్తోంది. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో చెమటోడ్చి గెలిచిన భారత్.. పసికూన అఫ్గానిస్థాన్ జట్టుపై అలవోకగా విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ భారీ శతకాన్ని నమోదు చేయడంతో 15 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్‌పై తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో విఫలమైన హిట్ మ్యాన్.. పసికూన అఫ్గాన్‌పై శతకంతో చెలరేగిపోయాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈరోజు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాలో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా పాకిస్తాన్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
2023 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ రెండో విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.