GT vs KKR: ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన గుజరాత్ సేన మొదటి 10 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 88 పరుగులు చేసింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో జగదీశన్‌కు క్యాచ్ ఇచ్చి వృద్ధిమాన్ సాహా అవుట్ అయ్యాడు. సాహా 17 బంతుల్లో 17 రన్స్ చేశాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్ నిలకడగా ఆడుతోంది.
గుజరాత్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్(36), సాయి సుదర్శన్ (22) క్రీజులో ఉన్నారు. సాహా వికెట్ పడ్డాక కూడా గిల్, సుదర్శన్ నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో గిల్ ఐపీఎల్‌లో 2000 పరుగుల మైలురాయిని దాటాడు. స్వల్ప అస్వస్థత కారణంగా ఇవాల్టి మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా దూరం కాగా అతని స్థానంలో రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హార్ధిక్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. టిమ్ సౌథీ స్థానంలో ఫెర్గూసన్, మన్‌దీప్ సింగ్ ప్లేస్‌లో జగదీశన్ తుది జట్టులోకి వచ్చారు.
Read Also: KKR vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్
గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విక్టరీ నమోదు చేయగా… కోల్‌కతా తన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో ఓడి.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. కెప్టెన్ రషీద్ ఖాన్ నేతృత్వంలోని గుజరాత్ తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తుండగా.. డిఫెండింగ్ చాంఫియన్లకు ఈ టోర్నీలో తొలి ఓటమిని రుచిచూపించాలని నితీశ్ రాణా సేన పట్టుదలతో ఉంది.