KKR vs GT: ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడేశాయి. గుజరాత్ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ఓ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్ వ్యవహరించనున్నాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ నేతృత్వంలోని గుజరాత్ తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తుండగా.. డిఫెండింగ్ చాంఫియన్లకు ఈ టోర్నీలో తొలి ఓటమిని రుచిచూపించాలని నితీశ్ రాణా సేన పట్టుదలతో ఉంది.

Read Also: IPL2023 : సన్ రైజర్స్ లోకి ఇంపాక్ట్ ప్లేయర్ గా ధరణి.. ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిన దసరా టీమ్..
గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విక్టరీ నమోదు చేయగా… కోల్‌కతా తన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో ఓడి.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది.