ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు.
కేప్‌టౌన్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రీడామణులు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ (68*, 55బంతుల్లో), అయేషా నసీమ్ (43*, 25బంతుల్లో) అద్భుతంగా రాణించిన వేళ పాకిస్థాన్ భారత్‌కు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఏకపక్ష విజయం సాధించి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన మరో సారి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా కివీస్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం బీసీసీఐకి ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్‌లోనే ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.
Suryakumar Yadav: టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 100 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టి అతడు ఈ ఫీట్ సాధించాడు. సూర్యకుమార్ కేవలం 61 ఇన్నింగ్సులలోనే 100 సిక్సర్ల ఘనతను సాధించాడు. గతంలో హార్దిక్ పాండ్యా 101 అంతర్జాతీయ ఇన్నింగ్సులలో 100 సిక్సర్లు కొట్టి భారత్ తరఫున టాప్‌లో నిలిచాడు.…
Team India: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే తాము ర్యాంకులను పెద్దగా పట్టించుకోబోమని.. మైదానంలో ఎలా రాణించాలనేదానిపైనే చర్చిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. చివరి వన్డేలో తాను సెంచరీ చేయడం సంతోషంగా ఉందని.. కొంతకాలంగా రాణిస్తున్న తనకు ఈ సెంచరీ అదనపు మైలురాయి లాంటిదని తెలిపాడు. బోర్డుపై పరుగులు ఉన్నా ఇండోర్ లాంటి పిచ్‌పై ఎంతటి లక్ష్యం ఉన్నా సరిపోదని..…
Pakistan: పాకిస్థాన్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తొలగించింది. అఫ్రిది స్థానంలో 69 ఏళ్ల హరూన్ రషీద్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. టీ20 ప్రపంచకప్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ పదవి బాధ్యతల నుంచి…