టీ20 ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషాన్ (4), కేఎల్ రాహుల్ (18) చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ (14), కోహ్లీ (9) కూడా వారినే అనుకరించారు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ (12), హార్డిక్ పాండ్యా (23), జడేజా…
టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ రెండో విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో ఆప్ఘనిస్తాన్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో ఆ జట్టు రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ షాజాద్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. 33 బంతులాడిన ఈ భారీకాయుడు 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అలరించాడు.…
టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. కాసేపట్లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుండగా… ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్‌ను ఓడిపోయాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. భువనేశ్వర్ స్థానంలో శార్దూల్…
దుబాయ్ వేదికగా కాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం టీమిండియాను భయపెడుతున్నాడు. కొన్నేళ్లుగా టీమిండియా ఆడుతున్న నాకౌట్ మ్యాచ్‌లలో అతడు నిలబడితే చాలు.. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తథ్యం అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ అతడు ఎవరంటే అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. Also Read: భారత్-కివీస్…
మరికాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఈ రెండు జట్లు ఓడిపోయాయి. దీంతో ఈరోజు జరిగే పోరు ఇరుజట్లకు చావో రేవో లాంటిది. ఈ పోరులో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా..? Also Read: ధోనీ అభిమానులకు ఈరోజు మరపురాని రోజు ఈ…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకు అక్టోబర్ 31 మరపురాని రోజు అని చెప్పాలి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు ధోనీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 2005లో శ్రీలంకతో టీమిండియా ఏడు వన్డేల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో ధోని తన మాస్టర్ స్ట్రోక్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 299 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. అక్టోబర్ 31,2005 జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్…
టీ20 ప్రపంచకప్ రంజుగా సాగుతోంది. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు విజయాలతో దూసుకెళ్తున్నాయి. గ్రూప్ ఆఫ్ డెత్‌గా భావించిన గ్రూప్-1లో సెమీస్‌కు చేరే జట్లపై స్పష్టత వస్తున్నప్పటికీ గ్రూప్-2లోని జట్ల పరిస్థితి అయోమయంగా మారింది. దీనికి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కారణంగా కనిపిస్తోంది. భారత్ ఈ మ్యాచ్‌లో పరాజయం కావడంతో సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో పాకిస్థాన్ జట్టు సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పటిష్టమైన భారత్, న్యూజిలాండ్ జట్లపై గెలిచిన పాకిస్థాన్…
టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు. శుక్రవారం ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 పరుగులు చేసిన అతడు అంతర్జాతీయ టీ20ల్లో ఓవరాల్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. బాబర్ ఆడిన 26వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. గతంలో విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్సుల్లో వెయ్యి పరుగులు సాధించి రికార్డు సృష్టించగా..…
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో భాగంగా షార్జాలో జరిగిన బంగ్లాదేశ్-వెస్టిండీస్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరకు వెస్టిండీస్ జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. వెస్టిండీస్ టాపార్డర్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4), హెట్మెయిర్ (9), ఆండ్రీ రస్సెల్ (0) విఫలమయ్యారు. బ్యాటింగ్ చేస్తూ మధ్యలో మైదానాన్ని వీడిన కెప్టెన్ పొలార్డ్…
ఐపీఎల్లో ముంబై జట్టుకు కీలక ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా ఒకడు. అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్లో హార్డిక్ పాండ్యా పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. పైగా పలు ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడు బౌలింగ్ కూడా వేయలేదు. దీంతో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయావకాశాలు దెబ్బతిన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముంబై జట్టులో హార్డిక్ పాండ్యా చోటుకు అవకాశాలు సన్నగిల్లాయి. Read Also: గుడ్ న్యూస్ చెప్పిన క్రికెటర్…