ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎన్ని పనులు ఉన్నా అన్నీ ముగించుకుని వచ్చి టీవీల ముందు, ఫోన్ల ముందు అతుక్కుపోవాల్సిందే.. భారత్, పాకిస్తాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా అభిమానులకు పండగే.. ఎందుకంటే ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు తక్కువగా ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య ఎన్నో మరుపురాని మ్యాచ్‌లు జరిగాయి. అందులోనూ ఈ రెండు టీముల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
పాకిస్తాన్ టీం కొత్త కోచ్‌గా ముదస్సర్ నాజర్ బాధ్యతలు చేపట్టారు. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. ఎలాగైనా భారత్ పై గెలవాలనే ఉద్దేశంతో కొత్త కోచ్‌ను నియమించుకున్నారు. క్రికెట్ కోచ్‌గా అనుభవం ఉన్న నాజర్‌కు దుబాయ్‌లోని పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. భారత్-పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఫిబ్రవరి 23న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. కాగా.. టీమిండియా మొదటి మ్యాచ్‌లో గెలిచి ఎంతో ఉత్సాహంతో ఉంది. తర్వాత మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. టీమిండియా, పాకిస్తాన్ జట్లు సూపర్ సండే మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్‌లోని కరాచీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. దీంతో.. ఆఫ్ఘాన్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా విక్టరీతో మొదలు పెట్టింది. టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా.. భారత్ తన రెండవ మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులతో పాటు.. ఇతర దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. నేడు ఆఫ్ఘనిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్‌లోని కరాచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని చిఖోద్రాలో చోటుచేసుకుంది. ఇరవై మూడేళ్ల సల్మాన్ వోహ్రా జూన్ 22న గుజరాత్‌లోని చిఖోద్రాలో క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు.
ముంబైలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం కశ్మీరా ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ వ్యక్తి బంతిని గట్టిగా కొట్టాడు. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే.. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు రామ్ గణేష్ తేవార్‌గా గుర్తించారు.
Bull Stops Cricket Match, Video Goes Viral: సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తుంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం, రద్దవడం మనం చూసే ఉంటాం. అప్పుడప్పుడు పక్షులు, కుక్క కారణంగా కూడా మ్యాచ్ కాసేపు ఆగిపోతుంది. అయితే తాజాగా ఓ ఎద్దు మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఇందుకుసంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ఫాన్స్, నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఓ మారుమూల గ్రామంలో చిన్నపాటి క్రికెట్ టోర్నమెంట్…