టీ20 ప్రపంచకప్‌లో భారత అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 10 వికెట్లతో విజయఢంకా మోగించింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి టీమిండియాపై విజయకేతనం ఎగురవేసింది. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రిజ్వాన్ 55 బంతుల్లో 79 నాటౌట్, బాబర్ 52 బంతుల్లో 68 నాటౌట్ పరుగులు చేశారు.…
కంటికి కనిపించని మాయదారి కరోనా మహమ్మారి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తోందో తెలియని పరిస్థితి.. అందుకే భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, శానిటైజర్లు వాడాలని, గుంపులుగా ఉండొద్దని ఎంత ప్రచారం చేసినా.. కొందరు పెడచెవిన పెడుతూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకే కాలానికి చెందిన 35 మంది యువకులు కోవిడ్ బారినపడ్డారు.. తీరా ఆరా తీస్తే.. వాళ్లు అంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ అడినట్టు చెబుతున్నారు..…
క్రికెట్ ఆడుతుండగా పిడుగు పాటుతో ఓ యువకుడు కన్నుమూశాడు.. మరో ఎనిమిది మంది యువకులు గాయాలపాలయ్యారు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె శివారులోని ఈశ్వరమ్మ కాలనీలో శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆటకు ప్రారంభించారు స్థానిక యువకులు.. రెండు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడుతున్నారు.. అయితే, అదే సమయంలో.. భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది.. క్రికెట్ ఆడుతూ.. ఎంజాయ్ చేస్తున్న ఆ యువకులు ఊహించని ఘటన జరిగింది..…