IND vs PAK: సూపర్ సండేకు రెడీనా.. భారత్-పాక్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, పూర్తి వివరాలివే
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీని విక్టరీతో మొదలు పెట్టిన టీమిండియా
- రెండవ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనున్న భారత్
- టీమిండియా, పాకిస్తాన్‌కు సంబంధించిన మ్యాచ్ వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా విక్టరీతో మొదలు పెట్టింది. టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా.. భారత్ తన రెండవ మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులతో పాటు.. ఇతర దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా సంవత్సరాలుగా భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడతాయి. చివరిసారిగా ఈ రెండు జట్లు 2024 టీ20 ప్రపంచ కప్‌లో తలపడ్డాయి. తాజాగా.. మరోసారి పోరుకు సిద్ధమయ్యాయి. కాగా.. టీమిండియా, పాకిస్తాన్‌కు సంబంధించిన మ్యాచ్ వివరాలు, ఈ మ్యాచ్ లైవ్ ఎక్కడో చూడాలి.. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇతర వివరాలు తెలుసుకుందాం.
Read Also: CM Revanth Reddy : రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా..?
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. 5వ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఫిబ్రవరి 23, ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. కాగా.. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ ఆసక్తికర పోరును టీవీలో తిలకించేందుకు మీరు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్‌లో చూడవచ్చు. టీవీలో చూడటానికి వీలు కాని వాళ్లు.. మొబైల్‌లో కూడా చూడొచ్చు. ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్ యాప్‌లో చూడవచ్చు.
భారత్ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు
ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాన్, కమ్రాన్ గులాం, ఫహీమ్ అష్రఫ్.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!