బంగ్లాదేశ్-పాకిస్తాన్ మ్యాచ్ లో కొందరు అభిమానులు పాలస్తీనా జెండాలతో కనిపించారు. స్టాండ్ లో కొందరు ప్రేక్షకులు పాలస్తీనా జెండాలతో కనిపించారు. పాలస్తీనా జెండాలతో స్టాండ్స్‌లో ప్రేక్షకులు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలస్తీనాకు ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది.
క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. వైజాగ్లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనుంది. వచ్చే నెల 23న ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది.
2023 వన్డే వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇంత పెద్ద ఈవెంట్ లో మొదటి మ్యాచ్ చూడటానికి క్రికెట్ అభిమానులు ఎక్కువగా హాజరుకాలేదు.
ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత గెలుపు శాతం కంటే ఓటముల పర్సంటేజ్ ఎక్కువగా ఉందని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తుంటే రాహుల్ ద్రవిడ్ వల్ల టీమిండియాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు అని అంటున్నారు.
కొత్త జెర్సీలు ధరించిన ఆటగాళ్ల ఫోటోలు వైరల్ కావడంతో.. ఈ ఇష్యూపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) ని తిట్టుకుంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టెస్టు మ్యాచ్ లు అంటే పూర్తిగా వైట్ కలర్‌లో ఉండాల్సిన జెర్సీలు క్రమంగా రంగుల మయంగా మారుతుందని.. వన్డేల్లో ధరించే జెర్సీల్లా తయారు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశం పేరు ఉండాల్సిన స్థానంలో డ్రీమ్ 11 పేరు ఉండడం చూస్తుంటే దేశం కోసం క్రికెట్…
అహ్మదాబాద్‌కు కేటాయించిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఉత్కంఠంగానే కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షా మ్యాచ్‌ల ఎంపికలో ఏ మేరకు చక్రం తిప్పాడో క్లీయర్ గా అర్థం అవుతుంది. తన ఆధిపత్యాన్ని చూపిస్తూ తన సొంత ఇలాకాలో ఆసక్తిని కలిగించే ఐదు మ్యాచ్‌లు జరిగేటట్లు ప్లాన్ చేసుకున్నాడు. అందుకే జై షాను నెట్టింట క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో పాటు మీమ్స్‌తో రెచ్చిపోయారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా రెడీగా ఉంది.
మహేంద్ర సింగ్ ధోనిపై ఉన్న అభిమానం మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో మహేంద్రుడి క్రేజ్ ఎలా ఉందంటే అతను ఒక్క బంతి ఆడినా చాలు మాకు అదే మహాభాగ్యం అన్నట్లుగా ధోని అభిమానులు పరవశించిపోతున్నారు. అయితే ఎంఎస్ ధోని క్రేజ్‌కు ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలో సరైన బంతులు వేయడంలో వరుసగా విఫలమవుతున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పుకోనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో కూడా ధోని ఫ్యాన్ ఫాల్లోయింగ్ తారాస్థాయిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు అది అమెరికాలోని డబ్ల్యూడబ్ల్యూఈకి కూడా పాకినట్లుంది.
IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఆయన ఉచితంగా ప్రసారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూవర్షిప్ కలిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల డిజిటల్ ప్రసార హక్కులను ఈసారి ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని వయాకామ్18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ సంస్థ 2.7 బిలియన్ డాలర్లు చెల్లించింది.