టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పుకోనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో కూడా ధోని ఫ్యాన్ ఫాల్లోయింగ్ తారాస్థాయిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు అది అమెరికాలోని డబ్ల్యూడబ్ల్యూఈకి కూడా పాకినట్లుంది. 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌గా రెజ్లింగ్ రికార్డుల్లో నిలిచిన జాన్ సీనా.. మహేంద్ర సింగ్ ధోని ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. జాన్ సీనా ఇచ్చే ‘యూ కాంట్ సీ మీ’ అనే పోజ్‌కి సరిపడేలా ఉన్న ధోని ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Also Read : New police stations: జంటనగరాల్లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు.. జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్
అయితే లక్నో సూపర్ జెయింట్స్‌తో రద్దయిన మ్యాచ్‌లో చెన్నై బౌలింగ్ సమయంలో ధోని ‘యూ కాంట్ సీ మీ’ అన్నట్లుగా పోజ్ ఇచ్చాడు. ఇలా ధోని ఫోటోలను సీనా షేర్ చేయడంతో అటు ఇండియన్ క్రికెట్ అభిమానులు, భారత్‌లోని WWE ఫ్యాన్స్, ఇటు మహీ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాన్ సీనా పోస్ట్‌పై ధోనీ ష్యాన్స్ తెగ స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే జాన్ సీనాకి ఉన్న ఓ చెడ్డ అలవాటు ఏమిటంటే.. తను షేర్ చేసే ఏ ఫోటోలకు ఇప్పటి వరకు క్యాప్షన్ రాయలేదు.. కానీ ఎంఎస్ ధోని ఫోటోపై లేదా ధోని గురించి జాన్ సీనా క్యాప్షన్ రాయకపోవడంతో కొందరు అభిమానులు నిరాశపడ్డారనేది క్లీయర్ గా తెలుస్తోంది.
Also Read : President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తప్పని కరెంట్ కోతల తిప్పలు..