గాజాపై ఇజ్రాయిల్ మారణహోమం ముగియాలని, రాజకీయాల కోసం ఈ నిరసనల్లో పాల్గొనలేదని, మానవత్వం కోసం పాల్గొన్నామని స్టాలిన్ అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూనే, పాలస్తీనియన్లకు మానవ హక్కుల మద్దతు ఉంటుందని చెప్పారు. గతేడాది గాజాలో 50,000 మంది మరణించారని, ఇందులో 26 వేల మంది పిల్లలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్ ప్రపంచ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
Bombay High Court: పాలస్తీనా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరసనకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జస్టిస్ రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇరాన్‌తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి.. కానీ, ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం అన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.
MA Baby: సీపీఎం పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఎంఏ బేబీని ఎన్నుకున్నారు. 71 ఏళ్ల బేబీ సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. తమిళనాడు మధురైలో జరిగిన సీపీఎం 24వ పార్టీ కాంగ్రెస్‌లో ఎంఏ బేబీని పార్టీ చీఫ్‌గా ఎన్నుకున్నారు. కేరళ నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు.
అలయ్ బలయ్‌పై సీపీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి బాబా చనిపోవడానికి కారణం అయిన కేంద్రంలో మీరు భాగస్వామి.. అలయ్ బలయ్ కి రాలేనని నారాయణ ప్రకటించారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆ పార్టీ ఎక్స్‌లో ప్రకటన చేసింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Sitaram Yechury: సీపీఐ(ఎం) సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు గురువారం రాత్రి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కులాంతర వివాహం జరిపించిన సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్ (CPIM) కార్యాలయంలో చోటు చేసుకుంది. జూన్ 13వ తేదీన వివాహం చేసుకున్న వివిధ కులాలకు చెందిన యువ జంటకు మార్క్సిస్ట్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించాకె. ఈ క్రమంలో.. పార్టీ కార్యాలయంతో పాటు, ఇద్దరు కార్యకర్తలపై దాడి చేశారు. కాగా.. ఈ ఘటనకు…
కేరళలోని సహకార బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలపై పినరయి విజయన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ బుధవారం విమర్శలు గుప్పించారు. తీవ్రమైన బ్యాంకింగ్ అక్రమాలు, కుంభకోణాల కారణంగా సామాన్యుల జీవితాల పొదుపు ప్రమాదంలో పడుతుందని ఆంటోనీ అన్నారు.