బెంగాల్‌లో 5న జరగబోయే ఉప ఎన్నికల్లో టీఎంసీపై కాంగ్రెస్, సీపీఐఎం కలిసి అధికార టీఎంసీపై దాడిని పెంచాయి. ఇండియా కూటమిలో ఒకవైపు మూడు పార్టీలు కలిసి ఉంటూనే.. ఉప ఎన్నిక రాగానే ప్రచారంలో అధికార టీఎంసీపై కాంగ్రెస్, సీపీఐఎం ఘాటు విమర్శలు చేస్తున్నాయి.
ప్రొ.హరగోపాల్‌తో పాటు తదితరులపై పెట్టిన దేశద్రోహం కేసును (ఉపా) వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ, అభ్యుదయ భావాలతో రాష్ట్ర దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆ పార్టీలు పేర్కొన్నాయి.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం మధ్య, మే 28న జరగాల్సిన వేడుకను బహిష్కరిస్తున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రకటించింది. సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ డాక్టర్ జాన్ బ్రిట్టాస్ ఈ వార్తను ధృవీకరించారు. కాగా, రాష్ట్రపతిని ప్రధాని మోదీ దాటవేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
Governor vs CM in Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా తయారైంది అక్కడి పరిస్థితి. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సోమవారం ఉదయం 11.30లోగా వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ రాజకీయ దుమారం ఏర్పడింది. ఈ వివాదాస్పద…
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన సీపీఎం మహాసభల్లో కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.. ఇప్పటి వరకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పి. మధు కొనసాగగా.. ఇవాళ కొత్త కార్యదర్శిగా వి. శ్రీనివాసరావును ఎన్నుకున్నారు మహాసభలకు హాజరైన ప్రతినిధులు.. ఇకపై మధు స్థానంలో కార్యదర్శిగా శ్రీనివాసరావు కొనసాగనున్నారు.. ఇక, కార్యదర్శి పదవి కోసం శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్ పేర్లను పరిశీలించిన కార్యదర్శి వర్గం.. చివరకు శ్రీనివాసరావుకు పగ్గాలు అప్పజెప్పింది.. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా 13 మందిని ఎంపిక చేశారు.. రాష్ట్ర…