Manikrao Thakre: వామ పక్షాలతో పొత్తు ఉంటుంది.. క్లారిటీ ఇచ్చిన ఠాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manikrao Thakre: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోనుందని తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. వామపక్షాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి ఫలిస్తాయన్నారు. సీఎల్పీ నేత మల్లుభట్టి మంతనాలు సాగిస్తున్నారని అన్నారు. వామపక్షాలతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వామపక్షాలతో చర్చల బాధ్యతను మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించామన్నారు. వామపక్షాలతో కలిసి వెళ్లాలన్నదే తమ అభిమతమని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. వామపక్షాలకు ప్రత్యామ్నాయ స్థానాలు ప్రతిపాదించాలని సూచించినట్లు తెలిపారు. తెలంగాణలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను త్వరలో ఖరారు చేయనున్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులను ఖండించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ వెనుక బీజేపీ, ఎంఐఎం ఉన్నాయని మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సోదాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. వారిపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజల మద్దతు కాంగ్రెస్‌కు ఉందన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చేందుకే బీజేపీ ఐటీ దాడులు చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మేడిగడ్డను సందర్శించకుండా అడ్డుకోవడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డలో రహస్యం ఏంటి? ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టులను ప్రజలు ఎందుకు చూడకూడదన్నారు.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
రాష్ట్రానికి కాళేశ్వరం పుణ్యక్షేత్రంగా మారిందని విమర్శించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 60ఏండ్లలో నిర్మించినా నేటికీ చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. వరదలు, వర్షాలు లేకున్నా మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి ఏమీ కాలేదని కేసీఆర్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ సగం డబ్బులు చెల్లించడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుప్పకూలిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ శాఖలు దాడులు చేస్తున్నాయన్నారు. మహేశ్వరంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించే పరిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే కేంద్రంలో ఐటీ దాడులు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఏది చెప్పినా బీజేపీ అమలు చేస్తోందన్నారు. వ్యవస్థల వల్ల ప్రజలపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి వారు ఎన్నికల సమయంలో సంయమనం పాటించాలి. ప్రతిపక్షాలపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనన్నారు. ఐటీ దాడులపై కాంగ్రెస్ పార్టీ చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
మరోవైపు సీపీఐ, సీపీఎంలకు రెండు వందల సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను సీపీఐకి, మిర్యాలగూడతో పాటు మరో అసెంబ్లీ స్థానాన్ని సీపీఎంకు కేటాయించాలని కాంగ్రెస్ ఆలోచన చేసింది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక క్లారిటీ ఇంకా రాలేదు. కాంగ్రెస్‌లో ఇతర పార్టీల చేరికలు వామపక్షాలకు కేటాయించే సీట్లపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఈ తరుణంలో వామపక్షాల నేతలు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వానికి సీపీఎం రాష్ట్ర నాయకత్వం ఇవాళ మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే..
Mahbubnagar: వీరు మామూలోళ్లు కాదురా బాబు.. పోలీసునే హానీ ట్రాప్ లో పడేసిన కానిస్టేబుల్
- Tags
- congress
- cpi
- CPM
- elections
- Left parties
తాజావార్తలు
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..