Cable Bridge: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతగా లేదు.. అందుకే ఇలా అయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పై తారురోడ్డు డ్యామేజీ కావడంతో.. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డిలు కేబుల్ బ్రిడ్జ్ నాణ్యతని పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేబుల్ బ్రిడ్జ్ తీగల వంతెన పనులు నాణ్యతగా లేవు.. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యత లెకుండానే కాంట్రాక్టు పనులు చేస్తున్నారు.. కాంట్రాక్టులకి లాభాలు గడించడానికే పనులు అని ఆయన పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నిర్మించిన చెక్ డ్యాం లు వరదలకి కొట్టుకుపోయాయని చాడ వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ సొంత ప్రయోజనాలకే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారని ఆయన మండిపడ్డారు.
Read Also: Joe Biden: “ఇండియా-మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్” హమాస్ దాడికి కారణం..
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
మరోవైపు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. హడావుడిగా కేబుల్ బ్రిడ్జ్ పనులు చేసారు.. అందాల బ్రిడ్జ్ కలర్ సోకులు ఎగిరిపోయి.. పైనా పటారం లోన లోటారం లాగా కనబడుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ వారే కాంట్రాక్టర్లు కావున నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అందాల బ్రిడ్జ్ కాదు ఇది.. రేపు కూలిపోతే పరిస్థితి ఏంది? అని నారాయణ ప్రశ్నించారు. బ్రిడ్జ్ లు ఎలా కూలిపోతున్నాయో.. రానున్న రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంపై
జ్యూడిషల్ ఎంక్వైరీ చేయాలి అని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!