తెలంగాణలో కాంగ్రెస్ ఇవ్వజూపిన సీట్లపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆదివారం వరకు నిర్ణయం తీసుకోకపోతే సోమవారం కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే వామపక్షాల తో పొత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరో రెండు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సీపీఎంకు అదనంగా ఎమ్మె్ల్సీ పదవి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో పొత్తుల పై అధికారికంగా ప్రకటన రానుంది నాయకులు అంటున్నారు. సీపీఐకు కొత్తగూడెం, అసెంబ్లీ స్థానం ఇవ్వగా.. కొత్తగూడెం స్ఖానం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయనున్నారు. రెండో అసెంబ్లీ స్థానం పై సందిగ్ధత నెలకొంది. చెన్నూర్ లేదా కార్వాన్ స్థానాల్లో ఒకటి లభించే అవకాశం ఉంది.
Also Read : Dasoju Sravan : అమిత్ షా బీసీ సీఎం నినాదంపై దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు
కార్వాన్ స్థానానికి అభ్యర్ధిని ఇప్పటికే ప్రకటించినా, పొత్తులో భాగంగా అవసరాన్ని బట్టి సీపీఐకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. 55 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితా లోనే కార్వాన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్దిగా ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. సీపీఎంకు మిర్యాలగూడ తో పాటు, మలకపేట, ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ప్రతిపాదన పై చర్చలు జరుగుతున్నాయి. తొలి జాబితాలోనే మలకపేట స్థానానికి అభ్యర్దిగా షేక్ అక్బర్ పేరు ను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్ఠానం. కానీ, పొత్తు లో భాగంగా మలకపేట స్థానాన్ని సీపీఎంకు కేటాయించే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ స్థానం నుంచి జూలకంటి నాగిరెడ్డి పోటీ చేయనున్నట్లు, కార్వాన్, మలకపేట—ఈ రెండు స్థానాలను సీపీఐ, సీపీఎంకు కేటాయుంచనున్నట్లు సమాచారం.
Also Read : Raashi Khanna: ముసిముసి నవ్వులతో మైమరిపించే అందాలతో అలరిస్తున్న రాశి ఖన్నా..