మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఎజెండాను అమలు చేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు వామపక్షాల మద్దతు తీసుకొని.. మరోవైపు కేసీఆర్ హడావిడిగా అభ్యర్థులను ప్రకటించారని పేర్కొన్నారు. గతంలో మహాకూటమి ఏర్పాటులో జాప్యం జరగడంతో తమ పార్టీకి నష్టం జరిగిందని చెప్పారు.
Minister KTR: ఈనెల 16న కేసీఆర్ సమక్షంలో పొన్నాల పార్టీలో చేరుతారు.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
మరోవైపు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నామని చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఐదు అసెంబ్లీ సీట్లు అయిన బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, వైరా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించామన్నారు. దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోడీ నల్లధనం వెలికితీత, రెండు కోట్ల ఉద్యోగాల కల్పన నేటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సమగ్ర సర్వే చేసిన కేసీఆర్ ప్రజా ఆస్తులను దోచుకుంటున్నాడని మండిపడ్డారు.
Mrunal Takur : అయ్యో సీతకు ఎంత కష్టం వచ్చిందో.. ఆ సమస్యతో భాధ పడుతున్న మృణాల్..
బీఆర్ఎస్ పాలనలో చట్టాలను చుట్టాలుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ కేసీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ధరణి పోర్టల్ దరిద్రపు పోర్టల్ గా ఉంది, ధరణి పోర్టల్ కి వైరస్ పట్టిందని దుయ్యబట్టారు. మతోన్మాద, దోపిడీ పాలన నుండి తెలంగాణ ప్రజలను రక్షించేందుకే లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ఏర్పాటు అయ్యే కూటమిని గెలిపించాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు.