2023 అక్టోబర్ 21న కాళేశ్వరంకు చెందిన మేడిగడ్డ ప్రాజెక్టు ఏడవ బ్లాక్‌లోని 19-21 పియర్స్ కుంగిపోయాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అదే సమయంలో అన్నారం ప్రాజెక్టు ముందుభాగంలో కూడా బుంగపడి నీరు బయటకు వచ్చిందని, ఈ రెండు ప్రమాద ఘటనలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్రంలో సర్వత్రా అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలపై న్యాయ విచారణకు…
వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. షర్మిల రాకతో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమికి కూడా ప్రయోజనమేనన్న ఆయన.. వైసీపీ నుంచి బయటకు రావాలనుకునే వారికి షర్మిల ద్వారా అవకాశం దొరికినట్టే అన్నారు.. అయితే, ఇల్లు అలకగానే పండుగ కాదు.. షర్మిల రాకతోనే వెంటనే అన్నీ జరగబోవు అని వ్యాఖ్యానించారు.
ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామక్రిష్ణ అన్నారు. 82 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఎందుకు వచ్చిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కంటే జగన్ పెద్ద నియంత అని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతారని రామక్రిష్ణ పేర్కొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు కొట్టుపోతే మరమ్మతులు చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ…
తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. తీర ప్రాంతమైన సూళ్లూరుపేట నియోజకవర్గంలో తుఫాన్ దెబ్బకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తే మనసు కలిచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చి బీఆర్ఎస్ ను గెలిపించేలా బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని అర్థమవుతోందని ఆరోపించారు.