కరోనా సోకదని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పంజాబ్ ఎక్స్పర్ట్ కమిటీ హెడ్ డాక్టర్ కె కె తల్వార్ క్లారిటీ ఇచ్చారు. మద్యం తీసుకుంటే కరోనా రాదనే వార్తల్లో అసలు నిజం లేదని చెప్పారు. ఈ ఫేక్ వార్త వలలో పడకూడదని ప్రజలను కోరారు. ఈ అంశంపై తల్వార్ పూర్తి వివరణ ఇచ్చారు. అధికంగా మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి కరోనా సోకే అవకాశాలు ఇంకా పెరుగుతాయన్నారు. ఇలాంటి నకిలీ వార్తలు నమ్మితే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. వైరస్ ను నిరోధించే శక్తి ఆల్కహాల్ లేదని ఆయన పేర్కొన్నారు. అయితే చాలా తక్కువ మోతాదులో మద్యం సేవించడం వల్ల ఎలాంటి హాని లేదని ఆయన వెల్లడించారు.