Home
Covid19
Covid19 News
-
ఇండియా కరోనా అప్డేట్: స్వల్పంగా తగ్గిన కేసులు… పెరిగిన మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 2,59,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది. ఇందులో 1,31,08,582 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 20,31,977 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,54,761 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. … -
మెట్రోపై కరోనా ప్రభావం… ఆక్యుపెన్సీలేక అవస్థలు…
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోను ఏర్పాటు చేశారు. ఈ మెట్రో రైళ్లు ప్రారంభం తరువాత ప్రతి రోజు కనీసం రెండు లక్షల మంది వరకు ప్రయాణం చేసేవారు. అయితే, మొదటి దశ కరోనా సమయంలో మెట్రో రైళ్లు మూతపడ్డాయి. ఆ తరువాత తిరిగి మెట్రో ప్రారంభమైనా చాలా కాలం వరకు పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో మెట్రో సర్వీసులు తగ్గించుకుంటూ వచ్చారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న సమయంలో మళ్ళీ సర్వీసులు పెరిగాయి. కాగా,… -
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హై కోర్టు ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వంపై హై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన వివరాలేవీ ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడింది హై కోర్టు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదని ఫైర్ అయింది. పబ్లిక్ గ్యాదరింగ్స్ పై చర్యలు తీసుకోవాలని చెప్పినా ఎందుకు తీసుకోలేదని పేర్కొంది హై కోర్టు. పబ్ లు, బార్లపై క్లబ్ లపై చర్యలు ఏమయ్యాయి ? హై కోర్టు సీరియస్ అయింది. మీకు ఆదాయమే ముఖ్యమా… -
కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
ఛత్తీస్ ఘడ్ విషాదం చోటుచేసుంది. రాయపూర్ పచ్పెడీనాకా పరిధిలోని రాజధాని ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 రోగులు దహనం అయ్యారు. ఐసియూలోని ఫ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా చెలరేగిన మంటలు.. ఆస్పత్రిలోని కరోనా రోగుల వార్డ్ కు వ్యాపించింది. దీనితో అక్కడి రోగులు పరుగులు పెట్టారు. అటు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం పరిశీలించగా 5… -
30లక్షలు దాటేసిన కరోనా మరణాలు !
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే తాజాగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్ లలో కరోనా పరిస్థితులు ప్రమాదకార స్థాయికి చేరుకున్నాయి. వాస్తవ మరణాల సంఖ్య భారీగానే ఉంటాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 7 లక్షలకు… -
కరోనా భయంతో ఆ మూడు వేల మందిని…
ప్రపంచాన్ని కరోనా ఎంతగా భయపెడుతుంది అంటే… తప్పులు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా అక్కడి నుంచి పంపించే విధంగా భయపెడుతోంది. ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా ఖండాలతో పాటుగా అటు ఆఫ్రికా ఖండంలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో కేసులు పెరగడం అంటే అక్కడ మరణమృదంగం అని చెప్పాలి. ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో వైద్య వసతులు తగినంతగా ఉండవు. పైగా, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో చాలా వరకు ఒక్క వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు… -
ఏపీలో వచ్చే వారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ… ?
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఏకంగా ఆరు వేలకేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ పెట్టే ఆలోచన చేస్తోంది జగన్ ప్రభుత్వం. రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే… కరోనా కేసులను అరికట్టవచ్చని… -
ఆసుపత్రి నుంచి కరోనా రోగులు పరారీ… ఆందోళనలో వైద్యులు
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక కరోనా ఆసుపత్రులను పెంచుతూ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా రోగులకు టెస్టులు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, తమిళనాడులోని కొడైకెనాల్ లోని కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు రోగులు సడెన్ గా ఆసుపత్రి నుంచి పరారయ్యారు. దీంతో వైద్యులు షాక్ అయ్యారు. నాలుగురోజుల క్రితం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి కూతురిని చూసేందుకు… -
దిగ్విజయ్‌సింగ్‌కు కరోనా పాజిటివ్
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ మాజీ సిఎం దిగ్విజయ్ సింగ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఢిల్లీ లోని తన నివాసం లో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన పార్టీ నేతలు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. కొన్ని రోజులపాటు హోమ్ క్వారెంటైన్ ఉండాలని కోరారు దిగ్విజయ్ సింగ్. ఇది ఇలా ఉండగా గడిచిన 24… -
ఏపీలో కరోనా కల్లోలం.. టీడీపీ ఎంపీ కేశినేని నానికి పాజిటివ్
చైనా లో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. మొన్నటివరకు రోజువారీగా లక్షలోపు కరోనా కేసులు నమోదవగా.. ఇప్పుడు ఏకంగా 2 లక్షలు దాటుతున్నాయి. అయితే ఈ వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు కరోనా సోకింది. అయితే తాజాగా విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా…
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!