
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒకవైపు కరోనా కేసులతో పాటు, మరోవైపు మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో దాదాపుగా రెండు వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పేర్కోన్నారు. బ్లాక్ ఫంగస్ కేసుల బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుండటంతో వీరికోసం మెడికల్ కాలేజీకలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను బ్లాక్ ఫంగస్ చికిత్స కేంద్రాలుగా మార్చి చికిత్స అందిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ కు అందించే వైద్యం ఖర్చుతో కూడుకొని ఉండటంతో వీలైనంత తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మహాత్మా పూలే జన్ ఆరోగ్య యోజన కింద చికత్స అందిస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి పేర్కోన్నారు. బ్లాక్ ఫంగస్ బాదితులకు ఆంఫోటెర్సిన్ బీ ఇంజెక్షన్‌లు అవసరం అవుతాయని, ముందు జాగ్రత్తలో భాగంగా లక్ష ఇంజెక్షన్ల కోసం టెండర్లు పిలిచినట్టు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. బ్లాక్ ఫంగస్ బాదితుల్లో 50 శాతం మరణాలు సంభవిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.