ఏపీ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత కిందకు దిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 57,745 శాంపిల్స్ పరీక్షించగా.. 1085 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 08 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 1541 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,60, 91,…
పాఠశాలల రీ-ఓపెన్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం టేబుల్ పై ఉందన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేయడం వల్ల ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్రస్మా ప్రతినిధులు ఎమ్మెల్సీ పల్లాకు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభంపై సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా పల్లా చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 364 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 482 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,758 కు చేరగా.. రికవరీ కేసులు 6,44,294 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ల ప్రభావం ఏ మేరకు ఉన్నది అనే విషయంపై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కీలక పరిశోధన చేస్తున్నది. ఈ కీలక పరిశోధనల ప్రకారం, కరోనా మొదటితరం ఆల్ఫా వేరియంట్‌పై ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని, కానీ, డెల్టా వేరియంట్‌పై ప్రభావం కొంతమేర తక్కువగానే ఉందని ఆక్స్‌ఫర్డ్ పరిశోధనలలో తేలింది. డిసెంబర్ 1, 2020 నుంచి మే 16, 2021 వరకు శాంపిల్స్‌ను సేకరించి పరిశోధనలు చేశారు. అదే విధంగా మే 17, 2021 నుంచి ఆగస్టు…
ఇండియా లో “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడచిన 24 గంటలలో 36,401 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…530 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 39,157 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3.23 కోట్ల కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,64,129 కు చేరగా…దేశ వ్యాప్తంగా “కరోనా” పూర్తిగా కోలుకున్న వారి…
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది. వ్యాక్సిన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ప్రకటించిన రాష్ట్ర వైద్యశాఖ.. థర్డ్ వేవ్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. అంతేకాదు 18ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే పబ్లిక్ ప్లేస్ లలో తిరిగేందుకు అనుమతి ఉండకపోచ్చంటోంది. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో.. కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం…
తెలంగాణలో పల్లెలు మంచం పట్టాయి. విషజ్వరాలు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వారం రోజుల నుంచి వాతావరణంలో మార్పులు.. దాంతో వైరల్ పీవర్ బారిన జనం పెద్ద ఎత్తున పడ్తున్నారు. దోమల బెడద కూడా తోడవడటంతో డెంగీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవతున్నాయి. హైదరాబాద్‌లో 447, ఖమ్మం లో 134 కేసులు, రంగారెడ్డి లో 110 కేసులు మొత్తానికి ఈ ఏడాది ఇప్పటికే 12 వందల…
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో నెలల తరబడి మూతబడ్డాయి స్కూళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులతో పాఠశాలలు సందడిగా మారాయి. కరోనా భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించరేమోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. ఐతే…అందుకు భిన్నంగా మొదటి రోజే 60 శాతం కంటే మించి విద్యార్ధులు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బడిబాట పడుతున్నారు పిల్లలు. తమ స్నేహితులను కలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. తాజాగా దేశంలో కొత్తగా 36,083 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,92,576 కి చేరింది. ఇందులో 3,13,76,015 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,336 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 493 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం…
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఆంక్షలు సడలించడంతో నిబంధనలను పక్కన పెట్టి బయట తిరుగుతుండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. పైగా ఇప్పుడు పిల్లల్లో కరోనా కేసులు బయటపడుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. తిరిగి ఆంక్షలు విధించేందుకు సిద్దమవుతున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 వ తేదీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పంజాబ్‌లోకి అడుగుపెట్టాలంటే తప్పనిసరిగా రెండు…