T20 World Cup: జయహో భారత్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డ్.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రికార్డ్స్ బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: ప్రపంచ కప్ షురూ అయ్యింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఫస్ట్ మ్యాచ్ గెలుపు అంత ఈజీగా రాలేదు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లు మొదట కాస్త తడబడ్డారు. చివరికి బౌలర్లు తమ అనుభవంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ మొదట బాగానే మొదలెట్టింది. కానీ మధ్య ఓవర్లలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్విక్ భారత బ్యాటింగ్‌ను గట్టిగా దెబ్బతీశాడు. ఆరవ ఓవర్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే వరుసగా అవుట్ అవ్వడంతో స్కోరు ఒక్కసారిగా పడిపోయింది. 13 ఓవర్లకే భారత్ 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ చేజారిపోతుందేమో అనిపించింది. అలాంటి సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగాడు.
READ MORE: Astrology: ఫిబ్రవరి 8, ఆదివారం దినఫలాలు.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
తన అద్భుత ప్రదర్శనతో అమెరికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని బ్యాట్ నుంచి వచ్చిన పరుగులు భారత ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాయి. చివరి వరకు నిలిచిన కెప్టెన్ 49 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అతని పోరాటంతో భారత్ 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. అది అంత పెద్ద స్కోరు కాకపోయినా, బౌలర్లు తేలిలోకి మ్యాచ్ వెళ్లిపోయింది. లక్ష్య ఛేదనకు దిగిన అమెరికా జట్టు ధైర్యంగానే ఆడింది. మిలింద్ కుమార్, శుభమ్ రంజనే, సూరజ్ కృష్ణమూర్తి మంచి షాట్లు ఆడుతూ పోరాడారు. దీంతో మ్యాచ్ ఒక్కోసారిగా ఉత్కంఠగా మారింది. అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. కానీ భారత బౌలర్ల అనుభవం ఇక్కడ కనిపించింది. మొహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టమైన బంతులతో వికెట్లు తీసాడు. అర్షదీప్ సింగ్ కీలక సమయంలో బ్రేక్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ తన స్పిన్‌తో పరుగులు కట్టడి చేశాడు. ఈ ముగ్గురు కలిసి అమెరికా బ్యాటింగ్‌ను అదుపులోకి తెచ్చారు. చివరికి అమెరికా జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల పేరుపై ఉన్న రికార్డును దాటుతూ తొమ్మిది వరుస విజయాలతో కొత్త చరిత్ర సృష్టించింది.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!