తెలంగాణలో పల్లెలు మంచం పట్టాయి. విషజ్వరాలు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వారం రోజుల నుంచి వాతావరణంలో మార్పులు.. దాంతో వైరల్ పీవర్ బారిన జనం పెద్ద ఎత్తున పడ్తున్నారు. దోమల బెడద కూడా తోడవడటంతో డెంగీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవతున్నాయి. హైదరాబాద్‌లో 447, ఖమ్మం లో 134 కేసులు, రంగారెడ్డి లో 110 కేసులు మొత్తానికి ఈ ఏడాది ఇప్పటికే 12 వందల కేసులు నమోదయ్యాయి. రెండేళ్ళ క్రితం ఈ సారి సైతం డెంగీ డేంజరస్ గా విజృంభిస్తోంది.. హైదరాబాద్‌లో ఫీవర్ ఆస్పత్రి, నిలోఫర్, గాంధీ, ఉస్మానియాల్లోని ఓపీలు రోగుల క్యూ లైన్లతో నిండిపోతున్నాయి..
Read Also : ‘క్రేజీ అంకుల్స్’ అడల్ట్ సినిమా.. అడ్డుకుంటాం!
సాధారణ రోజుల్లో వచ్చే రోగలకంటే రెండు మూడు రెట్లు అధికంగా రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు.. ప్రభుత్వ దవాఖానాలే కాదు.. ప్రయివేట్ దవాఖానాల పరిస్థితి కూడా అలాగే ఉంది.. హస్పిటల్ ఏదైనా సరే రోగుల మాత్రం పెరిగి పోతున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితని బట్టి ఓపీ ట్రీట్ మెంట్ కొందరికి, తీవ్రతను బట్టి హస్పిటల్ లో మరికొందరిని చేర్చుకుని ట్రీట్ చేస్తున్నారు… అయితే ప్రయివేట్ ఆస్పత్రిలో మాత్రం డెంగీ లక్షణాలు కనిపిస్తే చాలూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం.