మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 8,309 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 236 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,40,08,183 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,68,790 మంది మృతి చెందారు. దేశంలో 1,03,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,22,41,68,929 మందికి టీకాలు వేశారు. ఇక గడిచిన 24 గంటల్లో 9905 మంది కరోనా నుంచి కోలుకున్నారు.