కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. కరోనా నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే ఒమిక్రాన్ నుంచి కొంతమేర రక్షణ పొందవచ్చు. ఆసుపత్రుల్లో చేరే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నా చాలా మంది నిర్లక్ష్యం వహించి వ్యాక్సిన్ తీసుకోవడం లేదు.…
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అని ప్రజలు భయపడిపోతున్నారు. యూరప్ దేశాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. అలానే, ఆఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు అధికమవుతున్నాయి. ఆసియా దేశాల్లోనూ ఇంచుమించు ఇదేవిధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటు వస్తున్న న్యూజిలాండ్ దేశంలోనూ కరోనా భయం పట్టుకుంది. కేసులు పెరుగుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ను వేగం చేశారు. Read: ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి ఇదే……
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ… ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,187 శాంపిల్స్ పరీక్షించగా… 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతి చెందారు. ఇదే సమయంలో 198 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,478…
ప్రపంచ ఆరోగ్యసంస్థ మరో హెచ్చరిక చేసింది. కరోనాకు ముందు సమయంలో ప్రజలు ట్రీట్మెంట్ కోసం సొంత డబ్బులు ఖర్చు చేశారు. దీంతో దాదాపు దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువ మంది తీవ్ర పేదరికంలో నెట్టివేయబడ్డారని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ప్రజలు వైద్యసేవలు పొందే విషయంలో కోవిడ్ ప్రభావం చూపుతోందని, ఫలితంగా ఇతర ఆరోగ్యసమస్యల కోసం ప్రజలు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది. Read: మాదాపూర్ ఎన్‌కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత… అల్లు అర్జున్…
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాలు తెలిసినప్పటికీ పొగతాగడం మానడం లేదు. పొగ తాగడం వలన ఊపిరితిత్తులు పాడైపోయే అవకాశం ఉంది. శ్వాససంబంధమైన జబ్బులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక, పొగతాగడం వలన గుండెసంబంధమైన జబ్బులు అధికంగా వచ్చే అవకాశం లేకపోలేదు. గుండెజబ్బులతో పాటు, క్యాన్సర్ వంటివి కూడా సోకే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంచితే కరోనా మహమ్మారి ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ శ్వాసవ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది. ధూమపానం అలవాటు…
దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వేరియంట్ 66 దేశాలకు పైగా పాకేసిందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా.. ఎవరూ మరణించలేదని.. సంబరపడుతున్న జనాలకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా యూకే లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బ్రిటన్ ప్రభుత్వం. ఇవాళ ఉదయమే ఒమిక్రాన్ సోకిన రోగి..…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 21010 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 108 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… ఒక్క కోవిడ్ బాధితుడు మృతి చెందరు. ఇదే సమయంలో 141 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,98,406 కు…
కోవిడ్, వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరిలోగా అందరికీ డబుల్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే కోవిడ్ నివారణలో ఉన్న పరిష్కారమని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయం అందరికీ అవాగాహన కల్పించాలని… గ్రామ సచివాలయాల్లో సంబంధించిన హోర్డింగ్స్ పెట్టాలని వెల్లడించారు. విలేజ్…
ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 202 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,97,860 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,75,636 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,456 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…