గత కొన్ని రోజులుగా కరోనా కేసులు ప్రపంచంలో పెరుగుతున్నాయి. యూరప్, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. కాగా ఇప్పుడు తైవాన్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండోసారి కరోనా కేసులు ఎలా మొదలయ్యాయి అనే అంశంపై పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రెండోసారి కరోనా ఓ మహిళా సైంటిస్ట్ కు సోకిందని అమె ద్వారా తైవాన్‌లో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయని వెల్లడైంది.
Read: పెరుగు కోసం రైలును ఆపేసిన డ్రైవర్… వైరల్ కావడంతో…
తైవాన్‌లో హైసెక్యూరిటీ ల్యాబ్‌లో ఆ మహిళ పనిచేస్తున్నది. అయితే, ఈ ల్యాబ్‌లో కరోనా సోకిన ఎలుక ఆమెను రెండుసార్లు కరిచింది. ఎలుక కరిచిన తరువాతనే ఆ మహిళకు కరోనా సోకినట్టు పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని, ఎలుకల ద్వారా కరోనా సోకడం నిజమైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుందని, తైవాన్ పరిశోధకులు చెబుతున్నారు.