ఆంద్రప్రదేశ్ కు మరో 4.44 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులు… అనంతరం రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించారు అధికారులు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనున్నాయి వ్యాక్సిన్. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించింది. అయితే ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు 100 పైగా మరణాలు రాష్ట్రంలో సంభవిస్తున్నాయి.