కరోనా మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేక్ పడింది.. అయితే, అవసరాలను అనుగుణంగా కొన్ని ప్రత్యేక విమానాలు, కార్గో విమానాలను నడుపుతూ వచ్చినా.. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతూనే ఉంది.. ఇక, ప్రస్తుతం సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోన్న తరుణంలో.. విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు పొడిగించింది కేంద్రం. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31వ తేదీ అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. దీని ప్రకారం.. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది డీజీసీఏ.