డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన కూల్ లుక్ తో వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభాస్ న్యూ లుక్ లో కూల్ క్యాజువల్స్ లో.దర్శనమిచ్చారు. వైట్ ఓవర్ సైజ్డ్ టీ, కామో ప్యాంటు, బ్లాక్ స్నీకర్లతో తలను క్లాత్ తో కవర్ చేసి, ముఖానికి మాస్క్ ధరించి, వైట్ షేడ్స్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాన్ ఇండియా స్టార్ నటన, డౌన్ టు ఎర్త్ వైఖరి ఆయన అభిమానులను ఆకర్షిస్తుంది. కాగా కోవిడ్-19 కారణంగా సినిమా షూటింగులు నిలిపివేయడంతో ప్రభాస్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధమవుతుండగా, ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ కరోనా పరిస్థితి మెరుగుపడిన తర్వాత కొనసాగుతుంది.