కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అటు కోవిడ్ ఆస్పత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా గుజరాత్ లో మరో కోవిడ్ ఆస్పత్రిలో ఘోర ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భరూచ్ నగరంలోని వెల్ఫేర్ కోవిడ్ రోగుల ఆస్పత్రిలో ఇవాళ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 14 మంది మృతి చెందారు. వెల్ఫేర్ ఆస్పత్రిలో మంటలు చెలరేగగానే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి 50 మందికి పైగా కరోనా రోగులను కాపాడారు. అగ్నిప్రమాదం వల్ల 14 మంది మృతి చెందారని, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భరూచ్ జిల్లా ఎస్పీ రాజేంద్ర సింహ్ చుదాసహ పేర్కొన్నారు. ఆస్పత్రి ఐసీయూ వార్డులో ఆక్సిజన్ సిలిండర్ లీకై ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్పారు.