వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది.. 95 రోజుల్లోనే 13 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసింది.. అయితే, వయో వృద్ధులు, వికలాంగులకు, వీల్‌చైర్‌కే పరిమితం అయినవారికి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలని బాంబే హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది.. అయితే, వ్యాక్సీన్ ఇంటింటికీ తీసుకెళ్లి ఇవ్వడం సాధ్యం కాదని బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది కేంద్రం.. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేస్తే తలెత్తే సమస్యలపై వివరాలను హైకోర్టుకు అందజేసింది.. కాగా, ధృతి కపాడియా, కునాల్ తివారీలు…
శ్రీరామనవమి సందర్భంగా నితిన్ అభిమానులకు శుభాకాంక్షలు అందచేస్తూ, ‘మాస్ట్రో’ మూవీ టీమ్ ఈ రోజు ఉదయం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. స్కూటర్ పై నితిన్ ను ఎక్కించుకుని, నభానటేష్ డ్రైవ్ చేస్తున్న ఆ ఫోటో చూసి, చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. పండగ సందర్భంగా ఇలాంటి గ్లామర్ పోస్టర్ విడుదల చేశారంటీ అనే చర్చ కూడా సాగింది. ఇదిలా ఉంటే… ఈ పోస్టర్ లో డ్రైవింగ్ చేస్తున్న నభాతో, నితిన్ సైతం హెల్మెట్ పెట్టుకోవడం విశేషం.…
కరోనాకు చెక్ పెట్టడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పుడు భారత్‌లో 45 ఏళ్లు పైబడినవారికి వేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.. ఇక, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తారు.. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోందని కేంద్రం ప్రకటించింది.. కేవలం 95 రోజుల్లోనే 13 కోట్ల మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.. వేగంగా కరోనా టీకాలు ఇచ్చిన దేశం మనదేనని.. అదే…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. ఫస్ట్ వేవ్ కంటే వేంగంగా విస్తరిస్తోంది మహమ్మారి.. క్రమంగా వైరస్ బారిన పడుతోన్న సాధారణ ప్రజలతో పాటు వీవీఐపీల సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కోవిడ్ భారిన పడగా.. తాజాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ కు కూడా కోవిడ్ సోకింది.. ఆయన వయస్సు 61 సంవత్సరాలు.. తనకు కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా…
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి కుదించారు. తెలంగాణాలో రాత్రి కర్ఫ్యూ ఉన్న కారణంగా సెకండ్ షోస్ ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. దాంతో తెలంగాణలో థియేటర్లను ఈ నెలాఖరు వరకూ మూసేయాలనే నిర్ణయం వాటి యాజమాన్యం స్వచ్ఛందంగా తీసుకుందని, అయితే ‘వకీల్ సాబ్’ మాత్రం రెండు రోజులు ప్రదర్శిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ నిర్ణయంతో కొందరు థియేటర్ల యజమానులు విభేదించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే……
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఐసోలేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి భారీ బడ్జెట్ మూవీలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ మేకప్ ఆర్టిస్ కరోనా బారిన పడ్డారట. దీంతో ప్రభాస్ తో పాటు ‘రాధే శ్యామ్’ టీం మొత్తం ఐసోలేషన్ లో ఉంటున్నట్టు సమాచారం. ‘రాధే శ్యామ్’ మేకర్స్ ప్రస్తుతానికి షూటింగ్ షెడ్యూల్ ను నిలిపివేశారు. కరోనా మహమ్మారి సాధారణ పరిస్థితికి వచ్చాక సినిమా షూటింగ్…
కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఆందోళకు గురి చేస్తోంది. దేశంలో రోజురోజుకూ కరోనా బారిన పడ్డ వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ కరోనా మహమ్మారి ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్, విడుదలలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. క్రమంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో సినీ ప్రముఖులు సైతం తమ అభిమానులు, ప్రజలకు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఎక్సెప్షనల్ టైములో…
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘సూపర్’ చిత్రంతో 2005లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తన విలక్షణ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన అనుష్క… వరుసగా విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా అవతరించింది. బాహుబలి సిరీస్‌లో దేవసేనగా ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే బాహుబలి తరువాత అనుష్క సినిమాలను బాగా తగ్గించింది. తరువాత ఆమె నటించిన…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనా నుండి కోలుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా శనివారం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సంతోషకరంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ, తనకు తాజా పరీక్షలో నెగెటివ్ వచ్చిందని తెలిపింది. తనపై అభిమానంతో ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ కత్రినా కైఫ్ ధన్యవాదాలు తెలిపింది. గత కొంతకాలంగా ఆమె విక్కీ కౌశల్ తో రిలేషన్ షిప్ లో ఉందనే గుసగుసలు బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్నాయి.…
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా సోకిన కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు రోజుల క్రితం రెండవ సారి కరోనా బారిన పడ్డ బండ్ల గణేష్ ఆరోగ్యం క్రిటికల్ గా మారడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడ వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఇటీవలే ఆయనను ఐసీయూ నుంచి చికిత్స నిమిత్తం ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. అయితే…