కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు.. ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఇక, థర్డ్ వేవ్ ఎక్కువ చిన్నారులపైనే ప్రభావం చూపబోతుందంటూ పలు హెచ్చరికలు ఉన్నాయి.. అయితే, పెద్దవారి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోన్న మహమ్మారి.. చిన్నారులపై ఊపిరితిత్తులను ఏ స్థాయిలో దెబ్బతీస్తుందనేదానిపై అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు.. కానీ, కోవిడ్ వల్ల చిన్నారులు, కౌమారప్రాయుల్లో ఉన్నవారి ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపదని.. కోవిడ్ బారినపడినా.. వారి అవయవాల పనితీరులో పెద్దగా మార్పులు రావని గుర్తించారు శాస్త్రవేత్తలు.
స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చిన్నారులపై పరిశోన నిర్వహించింది.. చిన్నారుల ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చేపదని తేల్చింది.. ఇక, ఉబ్బసం ఉన్నవారిలోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని పేర్కొంది.. ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలను యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో విడుదల చేశారు.. ఆ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి.. తీవ్రస్థాయిలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బారినపడినవారిని మినహాయిస్తే.. పిల్లలు, కౌమార దశలో ఉన్నవారి ఊపిరితిత్తులు దెబ్బతినలేదని తేల్చేశారు శాస్త్రవేత్తలు. కాగా, చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని.. వారు తొందరగా కోవిడ్ బారినపడే అవకాశం కూడా లేదని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలోనూ కొంతమంది చిన్నారులు కరోనా బారినపడ్డారని.. థర్డ్ వేవ్‌లో కూడా అలాంటి పరిస్థితి ఉండొచ్చు.. కానీ, ప్రత్యేకంగా చిన్నారులపై అధిక ప్రభావం చూపుతుందనడంలోనూ సరైన ఆధారాలు లేవని వైద్య నిపుణులు తేల్చిన సంగతి తెలిసిందే.