భారత్‌లో కరోనా ఉధృతి తగ్గింది.. క్రమంగా రోజువారీ కేసుల సంఖ్య దిగివస్తోంది.. తాజాగా ఆ సంఖ్య 14 వేల కిందకు పడిపోయింది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 13,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 235 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 34,226 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. పాజిటివిటీ రేటు 1.24శాతానికి పరిమితమైంది. ప్రస్తుతం యాక్టివ్…
భారత్ కరోనా కేసులు భారీ సంఖ్యలో తగ్గుతూ వస్తున్నాయి.. 50వేల దిగువకు పడిపోయాయి రోజువారి కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 684 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు… ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 6 లక్షల దిగువకు పడిపోయి 5,37,045కు చేరింది.. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతం నుంచి 3.17 శాతానికి పడిపోయినట్టు…
భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.. దానికి అనుగుణంగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.. జనవరి మధ్యలో అత్యధిక కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు క్రమంగా మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి.. నిన్న 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తే.. ఇవాళ ఆ సంఖ్య 70 వేల దిగువకు పడిపోయింది.. ఇదే సమయంలో.. మృతుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగించే విషయం.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల…
ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ తర్వాత థర్డ్ వేవ్ రూపంలో భారత్‌పై విరుచుకుపడింది కరోనా మహమ్మారి.. అయితే, ఇప్పుడు మళ్లీ భారీగా కేసులు తగ్గుతున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83, 876 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒకేరోజు 11,56,363 శాంపిల్స్ పరీక్షించగా.. 83,876 కొత్త కేసులు వెలుగు చూశాయి.. మరో 895 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. మరోవైపు ఇదే సమయంలో 1,99,…
తమిళనాడు కరోనాతో వణికిపోతోంది. తమిళనాడులో కరోనా కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 23) నాడు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. లాక్ డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. అయితే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులకు వెళ్లే ట్యాక్సీలు, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు. గురువారం ఒక్కరోజే తమిళనాడులో 28,561 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా వీరవిహారం…
అగ్రరాజ్యం అమెరికా కోవిడ్ మహమ్మారి బారిన పడి గజగజా వణుకుతోంది. రోజూ వారి కేసుల సంఖ్య పదకొండు లక్షలకు చేరడంతో.. నివారించే మార్గం కానరాక అమెరికా తల్లడిల్లుతోంది. రోజు లక్షన్నర మందికి పైగా ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తుండడంతో.. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆరోగ్యరంగం సతమతమవుతోంది. రోజువారీ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బైడెన్ ప్రభుత్వం ఆర్మీ…
మరోసారి కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది… ప్రపంచదేశాల వెన్నులో వణుకుపుట్టిస్తోంది.. భారత్ సహా అనేక దేశాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు 31 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.. తాజాగా గణాంఖాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో.. 31,86,254 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 7,606 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 32 కోట్ల మార్క్‌ను కూడా…
భారత్‌లో కరోనా మరోసారి పడగవిప్పుతోంది.. గత ఐదారు రోజులుగా యమ స్పీడ్‌గా పెరిగిపోతున్నాయి పాజిటివ్ కేసులు.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఏకంగా 18 వేలకు పైగా కేసులు పెరిగాయి.. అయితే, సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. భారత్‌లోనూ ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాతే రోజువారి కేసులు మరోసారి కోవిడ్ మీటర్ పరుగులు పెడుతోంది.. ఇక, భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమైందని.. ఇప్పటికే 15కు పైగా రాష్ట్రాల్లో…
దేశంలో ఒమిక్రాన్ కేసులు అలజడి రేపుతున్నాయి. కేసుల్లో ఢిల్లీని అధిగమించింది మహారాష్ట్ర. పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కలిసి పెద్ద ఎత్తున సునామీ లాగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో. గతవారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 11 శాతం పెరిగాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం…
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 34,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మరణించారు. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,73,722 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం మృతుల సంఖ్య 3,975కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 కేసులు వెలుగు చేశాయి. కరీంనగర్ జిల్లాలో 14 కరోనా కేసులు గుర్తించారు. గడిచిన 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు.…