ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ తర్వాత థర్డ్ వేవ్ రూపంలో భారత్‌పై విరుచుకుపడింది కరోనా మహమ్మారి.. అయితే, ఇప్పుడు మళ్లీ భారీగా కేసులు తగ్గుతున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83, 876 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒకేరోజు 11,56,363 శాంపిల్స్ పరీక్షించగా.. 83,876 కొత్త కేసులు వెలుగు చూశాయి.. మరో 895 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. మరోవైపు ఇదే సమయంలో 1,99, 054 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు సర్కార్ పేర్కొంది. కాగా, థర్డ్ వేవ్ విజృంభణ మొదలైన తర్వాత జనవరి 6వ తేదీ నుంచి లక్ష మార్క్‌కు దిగువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.. ఇక, దేశవ్యాప్తంగా 11, 08, 938 కేసులు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 5,02,874కు చేరింది.. రికవరీల కేసుల సంఖ్య 4,06,60,202కు పెరగగా.. భారత్‌లో ఇప్పటి వరకు 1,69,63,80,755 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
Read Also: వెనక్కి తగ్గని కిమ్… ఆంక్షలు బేఖాతరు..!