ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 318 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 32,542 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,00,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. 187 రోజుల్లో ఇదే అతి తక్కువ.. మరోవైపు..…
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఐదు వేలకు పైగా కేసులు పెరిగాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 282 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 31,990 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,01,604 యాక్టివ్ కేసులు…
ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,720 శాంపిల్స్ పరీక్షించగా.. 1,365 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఎనిమిది మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇక, ఇదే సమయంలో 1,466 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,78,70,218గా…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన మళ్లీ మూడు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. 30వేల దిగువకు వచ్చిన కేసులు.. గత 24 గంటల్లో 34,403 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 320 మంది మరణించారు. ముఖ్యంగా కేరళలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ 34,403 కేసుల్లో దాదాపు 65 శాతం కేసులు కేరళ నుంచి నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళలో 22,182 కోవిడ్ -19 కేసులు…
కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్ణయంతో బడిబాట పట్టారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కొక్కరుగా స్కూలుకు చేరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెశామని చెబుతున్నా… కరోనా భయం మాత్రం విద్యార్థులను వీడడం లేదు. తెలంగాణ స్కూళ్లలో అప్పడే కరోనా కలవరం మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వారంపాటు…
భారత్‌లో కరోనా మహమ్మారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్ట్, డాక్టర్ సౌమ్య స్వామినాథన్.. ఇండియాలో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు. మరికొన్నిరోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందన్నారు. 2022 ఆఖరు నాటికి.. 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తై, కోవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయని చెప్పారు. భారతదేశంలో కోవిడ్ -19 ఇప్పుడు స్థానిక దశకు చేరుకుంటోంది. దాని వ్యాప్తి రేటు మునుపటి కంటే చాలా నెమ్మదిగా ఉంది..…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా? అంటే కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.. సిక్కోలులో పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతుండటంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందనుకుంటున్న వేళ కేసులు పెరగడం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలవరాన్ని పుట్టిస్తోంది. సరిగ్గా 4నెలల క్రితం రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న శ్రీకాకుళం.. ఆ తర్వాత కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలతో వైరస్‌ను నిలువరించింది. అయితే, మొన్నటి వరకూ…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. ఇంకా కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలోనే కేసులు వెలుగుచూస్తున్నాయి… నిన్నటి బులెటిన్‌లో జీహెచ్‌ఎంసీలో కంటే.. కరీంనగర్‌లోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవుతోంది… జిల్లాలో కరోనా ఉధృతిపై మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్… కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. అంతా తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.. ఎలాంటి ఆరోగ్య…
తగ్గినట్టే తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఇప్పటికే టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌కు సైతం కరోనా సెగ తగిలింది.. పలువురు క్రీడాకారులు కరోనబారినపడ్డారు.. అయితే, కరోనా కల్లోలం సృష్టించడంతో జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.. క్యాపిటల్ సిటీ టోక్యో సహా ఆరు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది జపాన్.. టోక్యో, సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్ధితిని ప్రకటించినట్టు ప్రధాని సుగ కార్యాలయం వెల్లడించింది.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని..…
రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.. ప్రస్తుతం కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన ఆయన.. సేకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసులు అధికంగానే ఉన్నాయని తెలిపారు.. డెల్టా వేరియంట్ భారత్ సహా 135 దేశాల్లో తీవ్రంగా ఉందన్న ఆయన.. నిన్న దేశంలోని 50 శాతం కేసులు ఒక కేరళలోనే వెలుగుచూశాయన్నారు.. డెల్టా వైరస్ శరీరం పై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు…