మరోసారి కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది… ప్రపంచదేశాల వెన్నులో వణుకుపుట్టిస్తోంది.. భారత్ సహా అనేక దేశాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు 31 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.. తాజాగా గణాంఖాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో.. 31,86,254 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 7,606 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 32 కోట్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది.. పాజిటివ్ కేసుల సంఖ్య 32,06,87,118కి పెరిగింది. ఇక, మొత్తం మరణాల సంఖ్య 55,38,809గా ఉంది.. ఇప్పటి వరకు 26,40,17,707మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకోగా.. ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 5,11,30,602గా ఉంది.
Read Also: ఖాకీలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి..
భారత్ లాంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరిగితే.. అమెరికాలో మాత్రం స్వల్పంగా తగ్గాయి.. యూఎస్‌లో కొత్తగా 8,06,493 మందికి పాజిటివ్‌గా తేలితే.. మరో 1,969 మంది కోవిడ్‌తో మృతిచెందారు.. ఫ్రాన్స్‌లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. అక్కడ కొత్తగా 3,05,322 కేసులు బయటపడ్డాయి. మరో 225మందిని కోవిడ్ మింగేసింది.. ఇటలీలో కొత్తగా 1,84,615 కేసులు వెలుగు చూడగా.. మరో 316 మంది మరణించారు.. అర్జెంటీనాలో కొత్తగా 1,28,402 మందికి వైరస్ సోకింది. మరో 138మంది చనిపోయారు. ఇక, జర్మనీ, బ్రెజిల్, భారత్‌లోనూ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.