ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. ఇందులో 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1341 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,75,649కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,23,354 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు ఇండియాలో 11,99,37,641 మందికి వ్యాక్సిన్ ను అందించారు.