తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే 10 శాతానికి పైగా కరోనా వృద్ధి కనిపించింది. దీంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ ను తప్పనిసరి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపాపధ్యంలో ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల కేంద్రంలో గత రెండు రోజుల వ్యవధిలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. మండలకేంద్రంలో వారం రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసరాల కోసం ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు గ్రామ పంచాయతీ ప్రకటించింది.