దేశంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్ లో పెద్ద వయసుకలిగిన వ్యక్తులకు కరోనా సోకగా, సెకండ్ వేవ్ లో ఎక్కువమంది యువత కరోనా బారిన పడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు, వేడుకలు, పబ్లిక్ ప్లేస్ లు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. ఎక్కువ మంది ఒక చోట గుమికూడి ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో కంటే కరోనా నగరాల్లో అధికంగా విస్తరిస్తోంది. 2టైర్, 3 టైర్ నగరాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్న నగరాల్లో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తుండటంతో అక్కడి ఆర్ధిక, సామజిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 45 ఏళ్ళు నిండిన వారికి మాత్రమే కాకుండా, యువతకు కూడా వ్యాక్సిన్ అందించాలని నిపుణులు చెబుతున్నారు.